జగన్ ఆఫీస్‌లో నెహ్రూ జయంతి, అఖిలప్రియ రికార్డ్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పార్టీ కార్యాలయంలో భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు నివాళ్లు అర్పించారు.

శుక్రవారం నాడు భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతి. ఈ సందర్భంగా వారు ఆయనకు నివాళులు అర్పించారు.

మరోవైపు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ గురువారం నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

హైదరాబాద్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో భారత ప్రథమ ప్రధాని నెహ్రూకు నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

వైయస్సార్ కాంగ్రెస్

వైయస్సార్ కాంగ్రెస్

హైదరాబాద్‌లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో భారత ప్రథమ ప్రధాని నెహ్రూకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతున్న ఉమ్మారెడ్డి. పక్కన విజయ సాయిరెడ్డి.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు గురువారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో అఖిల ప్రియ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు, పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ అమ్మలేని లోటు ఇప్పటికీ బాధగానే ఉందని, నాన్నపై అక్రమ కేసులు పెట్టి నా ప్రమాణ స్వీకారానికి దూరం చేశారన్నారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

నాన్న భూమా నాగిరెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా, తాను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఓకేసారి ప్రమాణం చేయాలని అనుకున్నామని, నాన్న విడుదలయ్యేంత వరకూ నంద్యాల నియోజకవర్గ ప్రజల సమస్యల్లో కూడా భాగస్వామినవుతానని చెప్పారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అఖిల తెలిపారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

కాగా, అఖిల ప్రియ ఎన్నిక నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉప ఎన్నికల్లో విజయం సాధించి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి అరుదైన రికార్డు సృష్టించారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

వారి విజయానికి కారణమైంది కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ. ఫ్యాక్షన్ రాజకీయాలకు మారుపేరైన ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి దివంగత భూమా శోభానాగిరెడ్డి, వీరి కూతురు భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు.

అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1989లో గెలుపొందిన భూమా శేఖర్ రెడ్డి 1992లో అనారోగ్యంతో మృతి చెందారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

ఆయన స్థానంలో సోదరుడు నాగిరెడ్డి 1992 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి సమీప ప్రత్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డిపై విజయం సాధించారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

1997లో భూమా నాగిరెడ్డి నంద్యాల లోకసభ స్థానానికి ఎన్నిక కావడంతో ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సతీమణి భూమా శోభానాగి రెడ్డి మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డిపై గెలుపొందారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

గత మేలో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆళ్లగడ్డలో మరోమారు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ తొలిసారి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 అఖిల ప్రియ

అఖిల ప్రియ

దీంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమార్తె... ముగ్గురూ రాజకీయ ఆరంగేట్రానికి ఉప ఎన్నికలు వేదిక కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+