ఏపీలో మరో కరోనా కేసు: 13కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనావైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. గుంటూరులో కరోనా సోకిన వ్యక్తి బంధువుకు కరోనా సోకడంతో మరో కొత్త కేసు నమోదైంది. దీంతో గుంటూరులోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది.
తాజాగా కరోనా కేసుతో పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకుంది.
కాగా, కరోనా అనుమానిత లక్షణాలతో సుమారు 120 మంది చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి 26,590 మంది వచ్చినట్లు, వారిలో 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఏపీ సర్కారు తెలిపింది. కాగా, విజయవాడలోని సిద్దార్థ మెడికల్ కాలేజీ, కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేన్నామని తెలిపింది. ఇప్పటికే కరోనా పరీక్షలు చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నుంచి అనుమతి వచ్చిందని వెల్లడించింది.

ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 49కు చేరింది. గురువారం మధ్యాహ్నం వరకు 44 ఉండగా.. రాత్రి మరో కేసు నమోదైంది. శుక్రవారం మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. గురువారం సికింద్రాబాద్‌లోని బుద్ధానగర్ కు చెందిన 45ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బారిన పడ్డారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడు దగ్గు, జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి కరోనా ఉందని తేల్చారు.
ఇక దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 850కిపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 25వేల మంది కరోనా బారినపడి మరణించారు. 5లక్షల 50వేల మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5,31,860 ఉండగా.. 25వేల మరణాలు చోటు చేసుకున్నాయి. అమెరికాలోనే అత్యధికంగా 85,653 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటలీ, చైనా కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు అమెరికాలోనే నమోదవడం గమనార్హం.












Click it and Unblock the Notifications