ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు: చిత్తూరులో అత్యధిక కేసులు, కర్నూలులో అత్యల్పం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా కరోనావైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, 1300కిపైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 56,720 నమూనాలను పరీక్షించగా.. 1365 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 1365 కరోనా కేసులు, 08 మంది మృతి

ఏపీలో కొత్తగా 1365 కరోనా కేసులు, 08 మంది మృతి

తాజాగా నమోదైన 1365 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,42,073కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 8 మంది మృతి చెందారు.
చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించగా, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,089కి పెరిగింది.

ఏపీలో 13,796 యాక్టివ్ కేసులు

ఏపీలో 13,796 యాక్టివ్ కేసులు


ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1466 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,14,180కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 13,796 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,78,70,218 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 212 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కర్నూలు జిల్లాలో 01 కొత్త కరోనా కేసు నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 04, చిత్తూరులో 212, తూర్పుగోదావరిలో 210, గుంటూరులో 131, కడపలో 153, కృష్ణాలో 104, కర్నూలులో 01, నెల్లూరులో 137, ప్రకాశంలో 166, శ్రీకాకుళంలో 22, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 19, పశ్చిమగోదావరిలో 157 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,89,836, చిత్తూరులో 2,42,589 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,698) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
    దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

    దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు మాత్రం 300కు పైనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 15,92,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,964 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.35 కోట్లకు పెరిగింది. ఆదివారం 383 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45లక్షలకు పెరిగింది. మంగళవారం 34వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.77 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.90 శాతానికి తగ్గింది. మంగళవారంనాడు 75,57,529 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 82.65 కోట్లకు చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+