కేరళలో బస్సు, వ్యాన్ ఢీ , 14 మంది ఆంధ్రా పోలీసులకు గాయాలు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

శబరిమల : శబరిమల సన్నిధానం సమీపంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 14మంది పోలీసులు తీవ్రంగా గాయపడగా వీరిలో ఎనిమిదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. వీరంతా శబరిమలకు విధుల్లో భాగంగా వెళ్లగా పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని కేరళ ఆర్టీసీ బస్సు ముందు నుంచి వేగంగా ఢీ కొట్టినట్లు తెలిసింది.

 14 ap police men injured in bus and car collision in kerala

దీంతో పోలీసుల వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. పోలీసుల వాహనం తీవ్రంగా దెబ్బతినడాన్ని బట్టి ప్రమాద తీవ్రత అర్థమవుతోందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ప్రమాదం గురించి తెలిసి పోలీసుల కుటుంబీకులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ప్రమాద వివరాల కోసం ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
14 ap police men have been injured in a bus and car collision in kerala near sabarimala.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి