వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైద్యవిద్యార్థిని మృతి కేసులో జీవిత ఖైదు, రిషికేశ్వరి కేసులో రిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: వైద్య విద్యార్థిని శ్వేత హత్య కేసులో నలుగురు నిందితులకు జీవిత ఖైదీ విధిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 2012వ సంవత్సరంలో కృష్ణా జిల్లాకు చెందిన శ్వేతను కిడ్నాప్ చేసి హతమార్చారు.

రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మూడో రోజు విచారణ కొనసాగుతోంది. విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్ దండే, ఐజీ సంజయ్‌, ఇతర అధికారులు హాజరయ్యారు.

14 days remand to accused in Rishikeshwari suicide case

14 రోజుల రిమాండ్

రిషికేశ్వరి మృతి కేసులో ముగ్గురు నిందితుల శ్రీనివాస్, జయచరణ్, అనీషాలను పోలీసులు అరెస్టు చేసి, శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. వారికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

ఇదిలా ఉంటగా, రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో విద్యా సంస్థల బంద్‌కు వైసిపి పిలుపునిచ్చింది. శుక్రవారం బంద్ సందర్భంగా పలువురు వైసిపి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బందులో పాల్గొన్న వైసిపి పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
14 days remand to accused in Rishikeshwari suicide case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X