కొద్దిగా ఊరట: ఏపీలో రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసుల్లో భారీగా తగ్గుదల: ఈ సారి 14.. 266కు టచ్..!

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో మరోసారి పెరుగుదల చోటు చేసుకుంది. ఇదివరకటి రోజులతో పోల్చుకుంటే పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందనే చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో కొత్తగా 14 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 266కు చేరుకుంది. మొత్తం అయిదుమంది ఈ ప్రాణాంతక వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

Recommended Video

    కరోనా వైరస్ Change In Temperature Will Not Impact Spread
    చాలా చోట్ల రెడ్‌జోన్..

    చాలా చోట్ల రెడ్‌జోన్..

    అత్యధికంగా కర్నూలు జిల్లాలో 56 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఫలితంగా- నంద్యాల, నందికొట్కూరు, బనగానపల్లి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెడ్‌జోన్, ఎల్లోజోన్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా ఆయా జిల్లాల్లోని మారుమూల గ్రామాలు, ఏజెన్సీల్లోనూ రెడ్‌జోన్‌ను విధించారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటికే అక్కడ 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

     అత్యధికంగా కర్నూలులో

    అత్యధికంగా కర్నూలులో

    రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చుకుంటే రాయలసీమలో అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కర్నూలు-56, కడప-23, చిత్తూరు-17, అనంతపురం-6 కేసులు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున వైరస్ వల్ల మరణించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటిదాకా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

    ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం ఉన్నవేనంటూ..

    ఢిల్లీ ప్రార్థనలతో సంబంధం ఉన్నవేనంటూ..

    జిల్లాలవారీగా అనంతపురం-6, చిత్తూరు-17, తూర్పు గోదావరి-11, గుంటూరు-32, కడప-23, కృష్ణా-28, కర్నూలు-56, నెల్లూరు-34, ప్రకాశం-23, విశాఖపట్నం-20, పశ్చిమ గోదావరి-16 కేసులు నమోదయ్యాయి. వారిలో చాలామంది ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవనంలో నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనలతో లింక్ ఉన్నవేనని అధికారులు చెబుతున్నారు. తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

    రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల..

    రోజువారీ కేసుల్లో భారీగా తగ్గుదల..

    తాజాగా నమోదైన కేసుల సంఖ్య కొద్దిగా ఊరట కలిగిందేనని చెబుతున్నారు వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు. ఇదివరకు నమోదైన కేసులను ఆధారంగా చేసుకుని చూస్తే.. వాటి పెరుగుదల వేగం తగ్గిందని చెబుతున్నారు. ఇదివరకు 30 నుంచి 40కి పైగా కేసులు నమోదవుతూ వచ్చిన విషయం తెలిసిందే. వాటితో పోల్చి చూస్తే పాజిటివ్ కేసుల సంఖ్యలో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని, ఇదే పరిస్థితి మున్ముందు నివేదికల్లో కూడా రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+