14 ఏళ్ల బాలుడు కిరాయి గుండాలతో హత్య చేయించాడు
కాకినాడ: ఓ యువకుడిని కిరాయి గూండాలతో హత్య చేయించిన 14 ఏళ్ల బాలుడి ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. అమలాపురానికి చెందిన యువకుడిని జులై 27న వాడలరేవు సమీపంలో హత్య చేశారు.
ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయగా ప్రధాన నిందితుడు 14 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించారు. బాలుడు పరారీలో ఉన్నాడు. కిరాయి గూండాలతో 14 ఏళ్ల బాలుడు యువకుడిని హత్య చేయించాడని పోలీసులు చెప్పారు.

ఇదిలావుంటే, అనంతపురం జిల్లా హిందూపురం మండలం దేవనహళ్లి సమీపంలో జంట హత్యలు జరిగాయి. ఈ జంట హత్య కేసులో మృతులు బీసీ సంఘం తాలూకా అధ్యక్షుడు నారాయణస్వామి, మరో గుర్తుతెలియని మహిళ ఉన్నారని పోలీసులు చెప్పారు. ఈ హత్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications