నిమ్స్ భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

Nims Hospital
హైదరాబాద్/నల్గొండ: నగరంలోని నిమ్స్ ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఓ రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా కాలం నుంచి చికిత్స పొందుతున్నా.. వ్యాధి నయం కాకపోవడంతో శనివారం ఉదయం ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి దూకి ప్రశాంత్(13) అనే రోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రశాంత్ గత కొంత కాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

భవనంపై నుంచి దూకిన ప్రశాంత్‌ను చికిత్స కోసం ఎమర్జెన్సీకి తరలించే లోపే మృతి చెందాడు. వ్యాధిని నయం చేసేందుకు తాము శ్రమిస్తున్నామని, అయితే తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆరో అంతస్తులో ఉన్న కిటికీ అద్దాలను తెరిచి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రశాంత్‌ను ఎమర్జెన్సీకి తరలించారు. తల, పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయని, ఎముకలు ఎముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు.

లారీ ఢీకొని ఇద్దరు మృతి

నల్గొండ/ప్రకాశం: జిల్లాలోని కోదాడ వద్ద జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఘటనలో ప్రకాశం జిల్లా గుడిపాడు గాజు ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై విద్యార్థులు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 15మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా విద్యార్థులు మేదరమెట్ల సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నట్లు తెలిసింది. విజయవాడ నుంచి ఆత్మకూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు గుడిపాడు సమీపంలో అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారయ్యాడు. కాగా ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+