వావ్.. ఏపీలో మరింత తగ్గిన కేసులు.. వంద పైచిలుకు కేసులు, ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వేల నుంచి వందలకు వచ్చేశాయి. రెండు, మూడు వందల వరకు కేసులు రావడంతో ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అలాగే దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి. 10 వేల లోపే కేసులు వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో జీరో కేసులు వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చిన వారు కూడా 3 రోజుల్లో పూర్తిగా కోలుకుంటున్నారు. ఇక ఢిల్లీ అయితే ఏకంగా.. కారులో మాస్క్ తప్పనిసరి కాదని స్పష్టంచేసింది. అలాగే ఆఫ్ లైన్ స్కూళ్ల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 15,213 కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే కేవలం 141 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 27 కేసులు నమోదు కాగా.. గుంటూరు జిల్లాలో 23 కేసులు వచ్చాయి. సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మిగతా కొన్ని జిల్లాల్లో కూడా కేసులు రాలేదు. ఇది శుభపరిణామమే.. ఇలాగే ఉంటే.. మిగతా జిల్లాల్లో కూడా కేసుల వ్యాప్తి మరింత తగ్గనుంది.

1,329 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,17,605 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,99,362 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. 3,518 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,725కి పెరిగింది. కేసుల తీవ్రత మాత్రం తగ్గింది. దీంతో సామాన్య జనం ఊపిరి పీల్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications