రూ.23వేల కోట్లివ్వండి: వైవి రెడ్డితో కేసీఆర్ (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచనలు బాగున్నాయని 14వ ప్రణాళికా సంఘం చైర్మన్ వైవీ రెడ్డి శుక్రవారం అన్నారు. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కేసీఆర్ కోరారని, సరిపోయే ప్యాకేజీని ఇస్తామన్నారు. తెలంగాణ ప్రణాళికలు అద్భుతమన్నారు. 25 శాఖల ప్రతిపాదనలు అందాయన్నారు.

కేసీఆర్ ప్రతిపాదనలు చేశారని తెలిపారు. రూ.23వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్ ప్రతిపాదించారని తెలిపారు. కేసీఆర్ సూచనలు బాగున్నాయన్నారు. తెలంగాణకు ఇచ్చే ప్యాకేజీ సముచితంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ సమస్యల పైన కేసీఆర్ సమర్థవంతంగా వివరణ ఇచ్చారన్నారు.

తాము నివేదిక రూపంలో సోమవారం ఈ ప్రతిపాదనలను కేంద్రానికి ఇస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల సమస్యలను తమకు చెప్పడంలో కేసీఆర్ విజయవంతమయ్యారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

అంతకుముందు కేసీఆర్ 14వ ఆర్థిక సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లాలు వెనుకబడి ఉన్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పేదరిక నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టామని తెలిపారు. బీసీల అభివృద్ధికి 20 వేల కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్ అగ్రభాగాన ఉందన్నారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం వేల ఎకరాల ఖాళీ భూములను ఇప్పటికే గుర్తించామని, రాష్ట్రంలో విద్యుత్ కొరత పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. ప్రాజెక్టులను అనుసంధానం చేసి ఇంటింటికీ తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం సమగ్ర కుటుంబ సర్వే చేపట్టామని, సమగ్ర సర్వే విజయవంతమైందన్నారు.

 కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. ఈ మొత్తం ప్రతిపాదనల విలువ రూ.23,475 కోట్లు.

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం


కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని కోరింది. కాగా, వాస్తవ పరిస్థితిని పరిశీలించి కేటాయిస్తామని చైర్మన్ వైవీ రెడ్డి తెలిపారు.

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.4,216 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

 కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధికి రూ.4,200 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

 కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. ఐటీ రంగానికి రూ.1,091 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. వాటర్ గ్రిడ్‌కు రూ.3,500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

 కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. హరితహారానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

 కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. రోడ్లకు రూ. వెయ్యి కోట్లు కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. ప్రాథమిక విద్యకు రూ.1,300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

కేసీఆర్, 14వ ఆర్థిక సంఘం

14వ ఆర్థిక సంఘానికి తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రతిపాదనలను గురువారం సమర్పించింది. వ్యవసాయ విద్యుత్తు కోసం రూ.1,300 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం కోరింది.

హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో 40 లక్షల మొక్కలు నాటుతామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి సిఫార్సు చేయాలని ఆయన 14వ ఆర్థిక సంఘాన్ని కోరారు.

లోకేష్ భావిసారథి: కొల్లు రవీంద్ర

టీడీపీ యువనేత నారా లోకేష్ సమర్థవంతమైన నాయకుడు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భవిష్యత్తులో తమ రథసారథి ఆయనే అన్నారు. బీసీ తీర్మానాన్ని సభలో ప్రవేశ పెట్టి చంద్రబాబు అందరి మన్ననలు పొందారన్నారు. బీసీ విద్యార్థుల సంక్షేమం కోసం 100 సంక్షేమ హాస్టళ్లు నెలకొల్పుతామన్నారు. చంద్రబాబు వంద రోజుల పాలన భేష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+