వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపిలో కొత్త‌గా 15 ల‌క్ష‌ల ఓటర్లు : తుది జాబితా 3.95 కోట్లు ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Ap Assembly Election 2019 : Andhra Pradesh State May Have 15 Lakh New Voters | Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్య 3.84 కోట్లకు చేరిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ ఏడాది జనవరి 11న సమగ్ర ప్రత్యేక సవరణ-2019కు సంబంధించిన తుది జాబితా ప్రచురించే నాటికి 3.69 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఈ మూడు నెలల వ్యవధిలో 15 లక్షల మంది పెరిగారన్నారు. ఓటు నమోదు కోసం వచ్చిన ఫారం-6లో ఇంకా 10,62,441 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాల్సి ఉందని, ఈ నెల 25 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుం దని చెప్పుకొచ్చారు.

3.95 కోట్ల ఓట‌ర్లు..
జనవరి 11 తర్వాత ఓట్ల తొలగింపు కోసం దాదాపు 9 లక్షలకు పైగా ఫారం-7 దరఖాస్తులొచ్చిన‌ట్లు సీఈవో చెప్పారు. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత 1,55,099 మంది పేర్లను జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. వీరంతా మృతిచెందిన వారు, ఒకే వ్యక్తి పేరు రెండు, మూడు సార్లు జాబితాలో ఉన్నవి, వలస వెళ్లిన వారివి. మిగతా దరఖాస్తులను నకిలీవిగా గుర్తించి తిరస్కరించినట్లు తెలిపారు. మోసపూరితంగా వచ్చిన దరఖాస్తులపై కేసులు నమో దు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు.

క‌డ‌ప గ‌డ‌ప‌లో తొడ‌గొట్టేది ఎవ‌రు.? త‌డ‌బ‌డేది ఎవ‌రు..? కొన‌సాగుతున్న ఉత్కంఠ‌..!!క‌డ‌ప గ‌డ‌ప‌లో తొడ‌గొట్టేది ఎవ‌రు.? త‌డ‌బ‌డేది ఎవ‌రు..? కొన‌సాగుతున్న ఉత్కంఠ‌..!!

15 Lakh new voters in AP : Total voters 3.95 cr

ఈ నెల 25న తుది జాబితా ప్రకటించేనాటికి 3.95 కోట్లకు చేరే అవకాశముందని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఓట‌ర్లకు ఏప్రిల్ 5 నాటికి ఎపిక్ కార్డుల పంపిణీ పూర్త‌వుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. ఈ నెల 22న భారీ సంఖ్య‌లో నామినేష‌న్లు దాఖ‌లు కానున్నాయి.

రంగంలోని వ్య‌వ ప‌రిశీల‌కులు
ఇప్ప‌టికే ఏపిలో ఎన్నిక‌ల వ్య‌యాన్ని ప‌రిశీలించేందుకు 102 మంది వ్యయ ప‌రిశీల‌కులు రంగంలోకి దిగారు. అదే విధంగా..ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు సైతం నియోజ‌క‌వ‌ర్గాల‌కు త‌ర‌లి వెళ్లారు. ఇక‌, పెయిడ్ ఆర్టిక్స‌ల్ పైనా ఎన్నిక‌ల అధికా రులు నిఘా పెట్టారు. ప్ర‌త్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోన్న కథనాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన ఏమైనా జరుగుతోందా అని నిఘా ఏర్పాటు చేసారు. ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌, ట్విటర్‌ తదితర ఖాతాలపై నిఘా పెట్టారు.

సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ వివిధ పార్టీలకు 89 నోటీసులు జారీ చేశారు. తెదేపాకు 48, వైకాపాకు 30, జనసేనకు 11 నోటీసులిచ్చారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారు తప్పు చేసినట్లు కాదని..ఎన్నిక‌ల సంఘం గుర్తించిన అభ్యంతరకర అంశాలకు సంబం ధించి వివరణ కోరతున్నారు. వారిచ్చే సమాధానం పట్ల సంతృప్తి చెందితే సరే.. లేదంటే అభ్యర్థుల ఎన్నికల వ్యయం లో ఆ మొత్తాన్ని కలుపుతామ‌ని ఇసి అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.

English summary
In Ap up to now approximately 15 lakh new voters added. With this total Voters of Ap may come to 3.95 cr. Election commission issued notices to AP political parties which using social media for campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X