10రోజులుగా లీకవుతున్నా.., నగరం హృదయ విదారకం
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలి 15 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. దీంతో నగరం గ్రామం విషాదంలో మునిగిపోయింది. పది రోజులుగా గ్యాస్ లీక్ అవుతున్నప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.
సంఘటన జరిగిన తర్వాత పలువురు గ్రామస్థులు జీపీఎస్ కార్యాలయం పైన దాడి చేశారు. సభ్యుల పైన విరుచుకు పడ్డారు. అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు.
ఇంట్లో ఉన్న వాళ్లు బతికారని, బయట ఉన్న వాళ్లు పేలుడు ఘటనకు మృతి చెందారని రోదిస్తున్నారు. గ్యాస్ లీకయిన విషయాన్ని తాము గుర్తించలేకపోయామని, గ్రామమంతా సహజవాయువు వ్యాపించిందని చెబుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగిందని, వంట కోసం పొయ్యి వెలిగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించిందన్నారు. గ్రామంలో పదిహేను మంది మృతి చెందడం, పలువురు గాయపడటంతో గ్రామంలో ఎక్కడ చూసినా ఆర్తనాదులు హృదయవిదారకంగా ఉంది. మరోవైపు కాకినాడ ఆసుపత్రులలో రోదనలు మిన్నంటాయి.
హెచ్చార్సీలో ఫిర్యాదు
ప్రమాద బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఫిర్యాదు చేసింది. పైపులైన్లు, పనులు జరిగే చోట పైరింజన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పైప్ లైన్ పేలిన ఘటన పైన జూలై 10వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications