రాజధానిలో 150 వైసీపీ దున్నపోతులు తిరుగుతున్నాయ్ .. వైసీపీ మంత్రులకు బోండా ఉమా కౌంటర్

టిడిపి అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు రాజధాని అమరావతి పర్యటన నేపథ్యంలో రాజధానిని స్మశానం తో పోలుస్తూ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై,అలాగే రాజధానిలో కుక్కలు, దున్నపోతులు తిరుగుతున్నాయి వాటితో పాటు చంద్రబాబు తిరుగుతాడు అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత బోండా ఉమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధానిలో వైసీపీకి చెందిన 150 పశువులు తిరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు తలమానికమైన రాజధాని అమరావతిని స్మశానం తో పోల్చడం వైసిపి నాయకులు ప్రజలు పట్టిందని ఉమా మండిపడ్డారు. ఇక రాజధానిని నాశనం చేస్తుంది వైసీపీకి చెందిన 150 పశువులేనని ఉమా మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని స్మశానం గా మార్చాలని ప్రయత్నం చేస్తుందని ఉమా దుయ్యబట్టారు. కొడాలి నాని రాజధానిలో దున్నపోతులు తిరుగుతున్నాయని చెప్పారు కానీ వాటి సంఖ్య చెప్పడం మర్చిపోయారని బోండా ఉమా ఘాటుగా విమర్శించారు.

150 cattle of YCP were roaming in the capital.. Bonda Uma counter to YCP ministers

రాజధానిలో తిరుగుతున్న దున్నపోతుల సంఖ్య 150 అని,అవి వైసీపీ దున్నపోతులని,ఇవి రాజధానిలో చేరి రాజధాని నాశనం చేస్తున్నాయని బోండా ఉమా వైసిపి మంత్రులపై విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీని స్మశానంలాగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని,అందుకే రాజధాని అమరావతిని స్మశానం తో పోలుస్తున్నారని బోండా ఉమా ఫైర్ అయ్యారు. తీరు మార్చుకోకుంటే కచ్చితంగా ప్రజలు రాజధాని అమరావతి లో చేరిన దున్నపోతులను తరిమి కొడతారని, ఇక అందుకు రాజధాని రైతులు చాలు అంటూ బోండా ఉమా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+