దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఎక్కడుందో తెలుసా?
ఇతర ప్రయాణ సాధనాలకన్నా రైలు ప్రయాణాలకు మన దేశంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారు వీటికే మొగ్గుచూపుతుంటారు. ప్రయాణం సుఖవంతంగా సాగడంతోపాటు అనుకున్న సమయానికే గమ్యస్థానానికి చేరుకోవడం ప్రధాన కారణం. 1853, ఏప్రిల్ 16న మనదేశంలో తొలి ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టారు. బోరీబందర్ (ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్) నుంచి థానే వరకు 34 కిలోమీటర్లు తొలి ప్రయాణం చేసింది. అప్పటి నుంచి ఏప్రిల్ 16వ తేదీన రైలు రవాణా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈరోజుతో భారతీయ రైల్వే 170 వసంతాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.
* ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే కూడా ఒకటి.
* సంవత్సరానికి 8.086 బిలియన్ల మంది ప్రయాణిస్తున్నారు.
* ఏడాదికి 1.208 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తున్న రైల్వే
* 170 సంవత్సరాలకు ముందే భారత్‌లో రైల్వేమార్గాలకు పథకాలు రూపొందాయి. జెమ్‌షెడ్జీ జీజీభోయ్, జగ్‌నాథ్ సుంకర్‌సేత్ తొలి రైల్వే రోడ్డు నిర్మాణాన్ని చేపట్టారు.

* ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వ్యవస్థల్లో ఇండియాది మూడో స్థానం. తొలి రెండు స్థానాల్లో అమెరికా, చైనా నిలిచాయి.
* దేశంలో 1,27,760 కిలోమీటర్ల మేర విస్తరించిన రైల్వే లైన్లు
* దేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్.
* వందేభారత్ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. 180 కిలోమీటర్లు కూడా ప్రయాణించగలదుకానీ అది ట్రాక్ సామర్థ్యాన్నిబట్టి ఉంటుంది.
* దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాలెం-ఊటీ మధ్య నడిచే ప్యాసింజర్. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

* దేశంలో అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫాం కర్ణాటకలోని హుబ్లీలో ఉంది. ఇటీవలే దీన్ని ప్రధానమంత్రి మోడీ జాతికి అంకితం చేశారు.
* దేశంలో మొదటి విద్యుత్తు రైలు 1925 ఫిబ్రవరి 3న పరుగులు తీసింది. ముంబయి విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ వరకు నడిచింది.
* దేశంలో మొదటి బుల్లెట్ రైలు 2027లో అందుబాటులోకి రానుంది. ముంబయి నుంచి అహ్మదాబాద్ మధ్య ఇది నడవబోతోంది.












Click it and Unblock the Notifications