ఏపీలో కొత్తగా 2252 కరోనా కేసులు, 15 మరణాలు: జిల్లాల వారీగా కొత్త కేసులివే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది వారాలుగా కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కరోనా టెస్టుల సంఖ్య కూడా తగ్గడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 84,858 నమూనాలను పరీక్షించగా.. 2252 మందికికరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2252 కరోనా కేసులు, 15 మంది మృతి

ఏపీలో కొత్తగా 2252 కరోనా కేసులు, 15 మంది మృతి


తాజాగా నమోదైన 2252 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,54,765కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 15 మంది మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కడప, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 13,256 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 22వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 22వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,440 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 19,19,354కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 22,155 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,41,34,961 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 385 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 27 మంది కరోనా బారినపడ్డారు.

Recommended Video

    Covid-19 Third Wave Likely In August India To See 1 Lakh Cases Daily Says ICMR Scientist
    ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే

    ఏపీలో జిల్లాల వారీగా కరోనావైరస్ కొత్త కేసులివే

    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 41, చిత్తూరులో 316, తూర్పుగోదావరిలో 385, గుంటూరులో 171, కడపలో 98, కృష్ణాలో 240, కర్నూలులో 53, నెల్లూరులో 269, ప్రకాశంలో 241, శ్రీకాకుళంలో 64, విశాఖపట్నంలో 125, విజయనగరంలో 27, పశ్చిమగోదావరిలో 222 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,75,688, చిత్తూరులో 2,29,150 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. కాగా, ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(81,318) కరోనా కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+