ఏపీలో స్థిరంగా కొత్త కరోనా కేసులు: 31వేలకు తగ్గిన యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదవువుతున్న కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా 3వేలకు దిగవనే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య తక్కువగానే ఉంటోంది. అయితే, కరోనా టెస్టుల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 91,070 నమూనాలను పరీక్షించగా.. 2982 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 2982 కరోనా కేసులు, 27 మంది మృతి

ఏపీలో కొత్తగా 2982 కరోనా కేసులు, 27 మంది మృతి

తాజాగా నమోదైన 2982 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,14,213కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 27 మంది మృతి చెందారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 12,946 మృతి చెందారు.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 31వేలకు యాక్టివ్ కేసులు

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 31వేలకు యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 3,461 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 18,69,417కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 31,850 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,26,99,142 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 616 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా కర్నూలులో 32 మంది కరోనా బారినపడ్డారు.

Recommended Video

    YSR Biography | Powerful People Come From Powerful Places || Oneindia Telugu
    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 95, చిత్తూరులో 401, తూర్పుగోదావరిలో 616, గుంటూరులో 242, కడపలో 120, కృష్ణాలో 298, కర్నూలులో 32, నెల్లూరులో 208, ప్రకాశంలో 345, శ్రీకాకుళంలో 92, విశాఖపట్నంలో 120, విజయనగరంలో 50, పశ్చిమగోదావరిలో 363 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,68,178, చిత్తూరులో 2,23,377 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+