వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనూహ్యం: సర్కార్ బడికి 2 లక్షల మంది విద్యార్థులు.. డ్రాఫవుట్స్ లెక్క ఇదీ..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇక విద్యార్థుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పాఠాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు సంబంధించి కీలక విషయం తెలిసింది. 2020-21 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి దాదాపు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల వైపు వెళ్లారు. ఇందుకు కారణం సరయిన ఉపాధి.. లేకపోవడంతో ప్రైవేట్ స్కూల్‌లో అంతో ఇంతో ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొంది.

2 లక్షల మంది విద్యార్థులు

2 లక్షల మంది విద్యార్థులు

ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 2 లక్షల మంది వరకు విద్యార్థులు స్కూల్ మారారు. అలాగే 60 వేల 253 మంది స్కూల్ మానేశారు. వారి జీవన ప్రమాణ స్థాయి బాగోలేకపోవడంతో ఇలా మానేశారని తెలిసింది. మొత్తం 3 లక్షల 58 వేల 873 మంది విద్యార్థులు ఉంటే వీరిలో 2 లక్షల 2 వేల 599 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి మారారు. వీరిలో 8 వేల 448 మంది ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ స్కూల్‌కి వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7 లక్షల 23 వేల 40 మంది విద్యార్థులు ఉంటే.. ప్రైవేట్‌లో 10 లక్షల మంది ఉన్నారు.

గతేడాది ఇలా..

గతేడాది ఇలా..

2019-20లో విశాఖలో 19800 మంది విద్యార్థులు స్కూల్ వెళ్లలేదు. 2020-21లో 36 వేల 16 మంది డ్రాపవుట్ ఉన్నారు. తూర్పు గోదావరిలో 3800 నుంచి 36 వేల 237 మంది ఉన్నారు. కర్నూలులో 10 వేల నుంచి 42 వేల 328 మంది తగ్గారు. అయితే ఆన్ లైన్ క్లాసులు జరగడం వల్ల, మరొ స్కూల్ వెళ్లేందుకు టీసీ అవసరం లేకుండటం వల్ల సరి అయిన లెక్క తేలడం లేదు.

Recommended Video

CBSE Syllabus In Ap Govt Schools | టీచర్ల సంగతేంటి? | Ys Jagan || Oneindia Telugu
తీసుకొస్తాం.. కానీ

తీసుకొస్తాం.. కానీ

మధ్యలోనే స్కూల్ ఆపివేసిన వారిని గుర్తించి.. తిరిగి తీసుకొస్తామని విద్యాశాఖ చెబుతోంది. ఏపీలో ఆగస్ట్ 16వ తేదీన స్కూల్ ఓపెన్ అవుతున్నాయి. ఆ లోపు తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. అయితే బడి మానేసిన వారిలో విద్యార్థినీలు ఉండటం కాస్త ఆందోళనకు కలిగిస్తోంది. ఉపాధి లేకపోవడంతో అలా వారు బడికి దూరమయ్యారు. విద్యార్థులను ఆకర్షించేందుకు చాలా పథకాలు ప్రవేశపెట్టారు. అయినా పెద్దగా స్పందన లేకపోయింది.

English summary
3,57,873 students either dropped out of school or took transfer certificates for moving to other schools in ap.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X