పుట్టినరోజు విషాదం: సముద్ర స్నానానికి వెళ్లి యువతీయువకుల మృతి

Subscribe to Oneindia Telugu

కృష్ణా: జిల్లాలోని మచిలీపట్నం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంగినపూడి బీచ్‌లో ఆదివారం సముద్రస్నానానికి వెళ్లిన ఇద్దరు యువతీ యవకులు దుర్మరణం చెందారు. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

కొండపల్లికి చెందిన టేకుపూడి అక్షిత(19) ఆదివారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు అమర్లపూడి ప్రవీణ్ (20), పొన్నం ఆదర్శ్ (21), నల్లమోతి వినయ్ ప్రమోద్ (20), యడ్ల స్వాతి (19)తో కలిసి గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలోని శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయానికి వచ్చారు.

అమ్మవారి దర్శనం చేసుకున్న వీరంతా మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంగినపూడి బీచ్‌కు చేరుకున్నారు. వీరిలో అక్షిత, ప్రవీణ్ సముద్రంలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఉద్ధృతంగా వచ్చిన అలల తాకిడికి ఉక్కిరిబిక్కిరయ్యారు.

అతన్ని రక్షించే ప్రయత్నం చేసిన అక్షిత(19) కూడా మునిగిపోయింది. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు, సందర్శకులు హుటాహుటిన వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు. కొనవూపిరితో ఉన్నవారిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ఇద్దూ చనిపోయారు.

కాగా, వీరిద్దరూ కూడా పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరిద్దరి మరణంతో ఇరుకుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

 2 polytechnic students drown off Manginapudi beach in AP

నీటి మునిగి ఐదుగురు మృతి

కడప జిల్లాలో పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లి నీటిలో గల్లంతై ముగ్గురు బాలురు మృతి చెందారు. కడప నగరం దండోరా కాలనీకి చెందిన ఒక కుటుంబం పెన్నానది ప్రవాహాన్ని చూసేందుకు వెళ్లింది. అక్కడ ఉన్న మరికొందరు బాలురతో కలిసి మొత్తం ఆరుగురు బాలురు సరదాగా సిద్దవటం సమీపంలోని మాచుపల్లె ఏరులో నీటిలోకి దిగారు.

అయితే ప్రవాహం ఎక్కువ కావడంతో ఆ విద్యార్థులు గల్లంతయ్యారు. జాలర్లు ముగ్గురు విద్యార్థులను రక్షించగలిగారు. అయితే కడప నగరం బెల్లం మండికి చెందిన షేక్‌సుహాల్ (10), దండోరా కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన రాయపాటి అఖిలేష్ (9), రాయపాటి కిరణ్‌కుమార్ (10) మృతదేహాలు రాత్రి 7 గంటల సమయంలో లభ్యమయ్యాయి.

పేరుపాలెంలో ఇద్దరు యువకుల మృతి

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతిచెందారు.
జిల్లాలోని ఇరగవరం మండలం పేకేరు గ్రామానికి చెందిన పదిమంది ఒకే కుటుంబీకులు ఆదివారం ఉదయం పేరుపాలెం బీచ్‌కు వచ్చారు. వీరంతా సముద్ర స్నానం చేస్తుండగా కెరటాల తాకిడికి ముగ్గురు కొట్టుకుపోసాగారు.

గమనించిన స్థానికులు వీరిలో ఒకరిని రక్షించగలిగారు. అయితే దాసరి కిరణ్ సుందర్ (35), నూక పేయి సూర్యప్రకాష్ (20) అనే ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. రెండు గంటల అనంతరం వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A picnic turned tragic as two polytechnic students today drowned in the Bay of Bengal off the Manginapudi beach near here, police said.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి