ఏపీలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు... కొత్తగా 214 మందికి పాజిటివ్,ఇద్దరు మృతి...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే డిశ్చార్జి అవుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 214 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,78,937కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7078కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3992 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం (డిసెంబర్ 21) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజాగా మరో 422 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినవారి సంఖ్య 8,67,867కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 40,295 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 1,13,01,105కు చేరింది.

214 new coronavirus cases and two deaths reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 105,చిత్తూరులో 105 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 72 కేసులతో గుంటూరు,93 కేసులతో విశాఖపట్నం ఉన్నాయి.అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,22,488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో... కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 46 కరోనా కేసులు,అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కరోనా కేసులు నమోదయ్యాయి.

త్వరలోనే భారత్‌లో అత్యవసర వినియోగం కోసం కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది.వ్యాక్సిన్ పంపిణీ కోసం అర్బన్ టాస్క్‌ఫోర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. పురపాలక శాఖ ఛైర్మన్‌గా 9 మంది సభ్యులతో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కోసం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందజేయడం, ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా టాస్క్‌ఫోర్స్‌లు పనిచేయనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+