ఏపీలో 27 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ, ఎవరు ఏ బాధ్యతల్లో అంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 27 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రెక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు.
ఐజీపీ (ఆపరేషన్స్)గా సీహెచ్ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీపీగా బీ రాజకుమారి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్‌గా జి. పాలరాజు, బాధ్యతలు స్వీకరించనున్నారు. కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ కర్నూలు ఎస్పీగా బదిలీ అయ్యారు.

తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, ఏసీబీ డైరెక్టర్‌గా ఆర్ జయలక్ష్మి,
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు, తిరుపతి జిల్లా ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్‌ఫోర్స్ ఎస్పీగా ఎల్ సుబ్బరాయుడు, ఏపీఎస్పీ కర్నూల్ సెకెండ్ బెటాలియన్ కమాండెంట్‌గా ఎం దీపిక, కో-ఆర్డినేషన్, హ్యూమన్ రైట్స్ అండ్ లీగల్ ఎస్పీగా కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డిబదిలీ అయ్యారు.
కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్, కడప ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్,
ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఎ. రమాదేవి, విజయవాడ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా సరిత, ఎస్‌సీఆర్‌బీ, సీఐడీ ఎస్పీగా పి. పరమేశ్వరరెడ్డి
సీఐడీ ఎస్పీగా ఎస్. శ్రీధర్, విశాఖపట్నం డీసీపీ (అడ్మినిస్ట్రేషన్)గా కృష్ణకాంత్ పటేల్ నియమితులయ్యారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మినిస్ట్రేషన్)గా ధీరజ్ కునుబిల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా జగదీశ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా జె. రామ మోహన్‌రావు, సీఐడీ ఎస్పీగా ఎన్. శ్రీదేవి రావు, పీటీవో డీఐజీగా- సత్య యేసుబాబు, వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డీఐజీగా అన్బురాజన్, గ్రేహౌండ్స్ డీఐజీగా బాబూజీ అట్టాడ,
ఏపీఎస్పీ డీఐజీగా ఫక్కీరప్ప, సీఐడీ ఎస్పీగా కె. చక్రవర్తి బదిలీ అయ్యారు.












Click it and Unblock the Notifications