హైవేపై కారులో చెలరేగిన మంటలు: ముగ్గురు సజీవదహనం
కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ సమీపంలో బత్తలూరు వద్ద 40వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న మట్టికుప్పలను ఢీకొంది.
ప్రమాదం జరిగిన వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్ అనే వ్యక్తిని నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బాధితులు ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, పిల్లలు ప్రేమ్‌కుమార్(5), ఉమేష్(2)లుగా గుర్తించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications