సీమాంధ్ర రాజధానికి మూడు ప్రాంతాల ఎంపిక?

3 locations in race for new Andhra Pradesh capital?
విజయవాడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు ప్రాంతాలను గుర్తించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి కొత్త రాజధానిగా మూడు ప్రాంతాలను ఎంపిక చేసినట్టు సమాచారం. వాటిలో మొదటి స్థానాన్ని కాకినాడకు కల్పించారు. రెండోదిగా గుంటూరులోని వినుకొండ నుంచి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మధ్య ఉన్న ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం. ఈ మేరకు మంగళవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

మూడోదిగా గుంటూరు జిల్లాలోని మాచర్లను పేర్కొన్నట్టు సమాచారం. ఈ మూడు చోట్ల తగినంత అటవీ స్థలాలు ఉన్నాయి కనుక భూసేకరణ సమస్య ఉండదని ప్రభుత్వ అభిప్రాయం. అటవీ సంరక్షణ చట్టాల నుంచి వాటిని డీనోటిఫై చేస్తే చాలునని, దానివల్ల స్థలం సమస్య రాదని భావిస్తున్నారు. 1.25 లక్షల ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేస్తే సరిపోతుందని అంచనా వేస్తున్నారు. అయితే, స్పష్టంగా ప్రాంతాలను ఎంపిక చేయలేదు. రాజధాని గుర్తింపునకు నిపుణుల కమిటీని వేయాలని నిర్ణయించింది

ప్రస్తుతం పరిగణనలో ఉన్నాయని భావిస్తున్న మూడు ప్రాంతాల్లో మార్కాపురం విజయవాడ - బెంగళూరు జాతీయ రహదారి మార్గంలో ఉంది. నీటి వసతికి శ్రీశైలం, గుండ్లకమ్మ ప్రాజెక్టులు ఉన్నాయి. పైగా రాయలసీమకూ దగ్గరగా ఉంది. మాచర్ల ప్రాంతం అయితే, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలు తీర్చుకోవచ్చు. హైదరాబాద్-గుంటూరు మధ్య జాతీయ రహదారి, రైల్వేలైన్ ఉండడం కలిసి వస్తాయి.

కాకినాడకు సమీపంలోనూ అటవీ భూములు ఉన్నాయి. గోదావరి నీటి వసతి అందుబాటులో ఉంది. హౌరా-చెన్నై జాతీయ రహదారి మార్గంలో ఉంది. అయితే, వీటిలో ఏ ఒక్కదానికీ విమానాశ్రయం లేదు. స్థానికంగా చిన్నపాటి విమానాశ్రయాలు ఏర్పాటు చేసి 100 నుంచి 150 కిలోమీటర్ల దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+