కృష్ణా జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా: 30 మంది చిన్నారులకు గాయాలు
విజయవాడ: కృష్ణా జిల్లాలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. జిల్లాలోని నందివాడ మండలం పుట్టగుంట వద్ద ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 30 మంది విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి.

సోమవారం ఉదయం స్కూలు పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు పుట్టగుంట వద్ద రాగానే ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గుడివాడకు చెందిన విద్యాలయం స్కూలుబస్సుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 58 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications