రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్: రాజమండ్రిలో తొక్కిసలాట, మృతి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: గోదావరి పుష్కర ప్రమాదంలో 16 మంది మృతి చెందినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా మంగళవారం నాడు ప్రకటించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోని ప్రమాదం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బాధ్యుల పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద విషాధ వాతావరణం కనిపిస్తోంది.

తొక్కిసలాటకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

తొక్కిసలాటకు ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాలను వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు పరామర్శించేందుకు వచ్చారు. ఆయన పరామర్శించారని భావించినప్పటికీ.. బాధితులు అడ్డుకోవడంతో అతను వెనుదిరిగారు.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మరోసారి తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉదయం భక్తుల తొక్కిసలాట నేపథ్యంలో 22 మంది వరకు మృతి చెందారు. ఈ నేపథ్యంలో పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తులు మూడు గేట్ల నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు.

కొవ్వూరు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్

పుష్కరాల నేపథ్యంలో అన్ని రహదారులు రాజమండ్రి, కొవ్వూరు తదితర ఘాట్ల వైపు సాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానం కోసం తరలి వస్తున్నారు. దీంతో దేవరపల్లి - కొవ్వూరు జాతీయ రహదారిపై 25 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. అంతర్వేదిలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 22 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.

 గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 32 మంది క్షతగాత్రులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు.

 గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

 గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 22మంది మృతి చెందారు. మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

గోదావరి పుష్కరాల్లో ప్రమాదం

మృతదేహాలను అప్పగించాలంటూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వద్ద మృతుల బంధువులు ఆందోళనకు దిగారు.

English summary
30 Minutes After CM Chandrababu's Dip, AP Stampede Erupted; 22 Killed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X