Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భర్తపై అలిగి వెళితే: ఎత్తుకెళ్లి చిత్తుగా తాగి లాడ్జిలో రేప్ చేశాడు

హైదరాబాద్: చెన్నైలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వివాహిత ఆత్యాచారానికి గురైంది. భర్తపై అలిగి చంటి బిడ్డతో కోయంబేడు బస్టాండులో సంచరిస్తున్న వివాహితను కిడ్నాప్‌ చేసి ఆపై లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఏపీకి చెందిన దంపతులు పనుల నిమిత్తం చెన్నైకి వెళ్లి విరుగంబాక్కం పిళ్లయార్‌ కోవిల్‌ వీథిలో నివసిస్తున్నారు. వీరికి ఐదు నెలల కుమార్తె ఉంది. అయితే శనివారం భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. దీంతో భర్తపై అలిగిన ఆమె తనతో పాటు బిడ్డను తీసుకుని ఏపీలోని తన పుట్టింటికి వెళ్లేందుకు కోయంబేడు బస్టాండుకు వచ్చింది.

ఇదే సమయంలో బస్టాండ్‌లో సంచరిస్తున్న ఆమెను గమనించిన ఓ వ్యక్తి దగ్గరకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తాను సిటీ బస్సు డ్రైవర్‌ నంటూ నమ్మించి ఆమెను తిరువేర్కాడులో లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం అక్కడ వారిద్దరూ కలిసి మద్యం సేవించారు. అదే అదనుగా భావించిన ఆ పరిచితుడు ఆమెపై అత్యాచారం జరిపాడు.

30 year old woman alleges raped in chennai lodge

ఆ తర్వాత ఆమె ఐదు నెలల బిడ్డతో సహా అక్కడ నుంచి పరారయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున నిద్ర నుంచి లేచిన ఆ యువతి తన బిడ్డ కనిపించకపోవడం లాడ్జి సిబ్బందిని వద్ద తనతోపాటు వచ్చిన వ్యక్తి గురించి ఆరా తీసింది. ఆ వ్యక్తి ఎప్పుడో వెళ్లిపోయాడని వారు చెప్పారు.

దీంతో ఆమె సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి లాడ్జిలో విచారణ జరిపారు. దీంతో బిడ్డను అపహరించిన వ్యక్తి నీతిమణి (45), చెన్నై, తిరునిండ్రవూరుకు చెందిన వ్యక్తి అని తెలిసింది. ఆ చిరునామాకు వెళ్లి పోలీసులు విచారణ జరపగా అది నకిలీదిగా తేలింది.

ఇదిలా ఉంటే గూడువాంజేరి రైల్వే స్టేషన్‌లో 40 ఏళ్ల వయసుగల ఒక వ్యక్తి మద్యం మత్తులో బిడ్డతోపాటు కనిపించాడు. దీంతో అతన్ని అనుమానించిన రైల్వే పోలీసులు అతన్ని,బిడ్డను గూడువాంజేరి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు.

క్రమశిక్షణా రాహిత్యం కారణంగా అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. సహ డ్రైవర్‌ను చూసేందుకు కోయంబేడుకు రాగా జ్యోతిని మోసగించి తిరువేర్కాడుకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీంతో అతన్ని తిరువేర్కాడు పోలీసులకు అప్పగించారు.

అతని వద్ద తీవ్ర విచారణ జరపగా కోయంబేడు బస్టాండులో ఒంటరిగా అవస్థలు పడే మహిళలను గుర్తించి లాడ్జికి తీసుకువెళతానని తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని పూందమల్లి కోర్టులో హాజరుపరచి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. ఆనంతంర చిన్నారని యువతికి అప్పగించి ఆమెను చెంగల్పట్టు మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+