Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖ ఉక్కు ఉద్యమానికి 300 రోజులు: నేడు భారీ ధర్నా; గేరుమార్చే ప్లాన్ లో కార్మికులు

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సాగుతున్న స్టీల్ ప్లాంట్ కార్మిక పోరాటం బుధవారం రోజుతో 300 రోజులకు చేరుకుంది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ సాగుతున్న కార్మిక పోరాటం ఉధృత రూపం దాల్చింది. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్న జనవరి 27 నుండి నేటి వరకు కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యొద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమాన్ని విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నారు.

 నేడు స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా ..

నేడు స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా ..

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమంలో భాగంగా నేడు స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని కార్మిక సంఘాలు ఏర్పాటు చేశాయి. గాజువాక వద్ద నేడు భారీ ధర్నా నిర్వహించి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తమ తమ డిమాండ్ కేంద్రానికి వినిపించేలా చేయాలని కార్మికులు భావిస్తున్నారు. కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిర్ణయం వెనక్కు తీసుకునే దాకా ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీజేపీ తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ మద్దతు ప్రకటించాయి. ఉద్యమం ప్రారంభంలో స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు ఆందోళనలు చేశాయి. కానీ స్టీల్ ప్లాంట్ ఆందోళన ప్రస్తుతం పట్టించుకునే నాధుడే లేడు అన్నట్టు తయారయ్యింది.

ఎన్ని ఆందోళనలు చేసినా స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని మార్చుకోని కేంద్రం

ఎన్ని ఆందోళనలు చేసినా స్టీల్ ప్లాంట్ పై నిర్ణయాన్ని మార్చుకోని కేంద్రం

కార్మికులకు తాము మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన వైసీపీ నేతలు పార్లమెంట్ వేదికగా స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవటంలో విఫలం అవుతున్నారు అన్న చర్చ సాగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటానికి వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తమ మద్దతు ప్రకటించి కార్మికులకు అండగా పోరుబాట పట్టాయి. ధర్నాలు, రాస్తా రోకోలు, మానవ హారాలు, ఢిల్లీ వేదికగా ఆందోళనలు ఎన్ని చేసినా కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని తేల్చి చెప్తుంది. దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ ఉంటుందని స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం తేల్చి చెబుతోంది. పార్లమెంట్లో ఎంపీలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

 విశాఖ ఉద్యమానికి ౩౦౦ రోజులు .. ప్రధాన ఘట్టాలు చూస్తే

విశాఖ ఉద్యమానికి ౩౦౦ రోజులు .. ప్రధాన ఘట్టాలు చూస్తే

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం 300 రోజుకు చేరుకున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సంబంధించి ప్రధాన ఘట్టాలు చూస్తే ఫిబ్రవరి మూడవ తేదీన కార్మికులు ప్రధాన పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. ఫిబ్రవరి 10వ తేదీన పరిరక్షణ పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఫిబ్రవరి 12వ తేదీన స్టీల్ ప్లాంట్ భవనం ముందు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఫిబ్రవరి 17వ తేదీన విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్ ను పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కలిశారు. మార్చి 9వ తేదీ విశాఖ ఉక్కు ప్రధాన పరిపాలన భవనాన్ని ముట్టడించారు. మార్చి 20వ తేదీన వేలాది మందితో కార్మిక గర్జన సభను నిర్వహించారు. ఇక ఆగస్టు 2వ, 3వ తేదీన ఢిల్లీకి చేరుకున్న ఉక్కు కార్మికులు ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేశారు. అక్టోబర్ 12వ తేదీన ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందించారు. ఇక ప్రధాన ఘట్టాలలో భాగంగా నవంబరు 26వ తేదీన స్టీల్ ప్లాంట్ ప్రధాన రహదారిపై వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. డిసెంబరు 7 వ తేదీన ఉక్కు పోరాటానికి మద్దతుగా మహిళలు మానవహారం నిర్వహించారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక పోరాటానికి మద్దతు ప్రకటించారు. వారి వద్దకు వెళ్లి సంఘీభావాన్ని తెలిపి కేంద్రం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఉక్కు పోరాటానికి మద్దతు పలికారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఎంతోమంది పోరాట ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం నిర్ణయం మార్చుకునేలా జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో చర్చించాలని, విశాఖ ఉక్కు కార్మికులకు అండగా నిలవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

కేంద్రానికి లేఖ రాసిన జగన్ ..నిర్ణయం మార్చుకోవాలని వినతి

కేంద్రానికి లేఖ రాసిన జగన్ ..నిర్ణయం మార్చుకోవాలని వినతి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్రమంతా వ్యతిరేకిస్తుంటే, ఇటీవల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో ముందుకు నడుస్తుంటే కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని తేల్చిచెప్పింది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి లేఖ రాసిన జగన్మోహన్ రెడ్డి, ప్రైవేటీకరణకు బదులుగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులను ఇవ్వాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. నిర్ణయం మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.

Recommended Video

    Visakhapatnam : London Eye Now In Vizag! || Oneindia Telugu
     స్టీల్ ప్లాంట్ విషయంలో పట్టు వీడని కేంద్రం .. సాగు చట్టాల రద్దుతో విశాఖ కార్మికుల ఆశాభావం

    స్టీల్ ప్లాంట్ విషయంలో పట్టు వీడని కేంద్రం .. సాగు చట్టాల రద్దుతో విశాఖ కార్మికుల ఆశాభావం

    ఎవరు ఎంత చెప్పినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎంతగా ఆందోళనలు చేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం మార్చుకునేలా కనిపించడం లేదు. నాడు స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారని, నేడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే వరకు తాము పోరుబాట పడతామని, ఉద్యమాన్ని ఆపేది లేదని స్టీల్ ప్లాంట్ కార్మికులు తేల్చి చెబుతున్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ 3వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్లుగా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలోనూ నిర్ణయం తీసుకుని ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ ప్రధానంగా వినిపిస్తుంది. ఇక అప్పటి వరకు ఉక్కు సంకల్పంతో ఉక్కు కార్మికులు పోరాట పంథాను వీడేది లేదని తేల్చి చెప్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+