ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు: 0 మరణాలు, కొత్త ఏడాది ప్రారంభంలో ఇదే గుడ్‌న్యూస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నిన్నటి పోల్చుకుంటే స్వల్పంగా తగ్గాయి. గురువారంనాటి కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 338 కరోనా కేసులు నమోదు కాగా.. ఆ సంఖ్య శుక్రవారం కాస్త తగ్గింది. శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 326 కరోనా కేసులు నమోదయ్యాయి.

Recommended Video

    Corona New Strain : 20 New Type Corona Virus Positive Cases Found In India
    ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు.. మరణాలు సున్నా

    ఏపీలో కొత్తగా 326 కరోనా కేసులు.. మరణాలు సున్నా

    గడిచిన 24 గంటల్లో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 326 కేసులు బయటపడ్డాయి. తాజాగా, నమోదైన 326 కరోనా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 8,79,717కు చేరింది. అయితే, గత ఒక్క రోజు వ్యవధిలో కరోనా కారణంగా ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కోల్పోకపోవడం శుభపరిణామమనే చెప్పాలి. ఇప్పటి వరకు 7108 మంది కరోనాతో మృతి చెందారు.

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు

    ఇక ఏపీ జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 24, చిత్తూరులో 44, తూర్పుగోదావరిలో 45, గుంటూరులో 41, కడపలో 16, కృష్ణాలో 53, కర్నూలులో 10, నెల్లూరులో 12, ప్రకాశంలో 7, శ్రీకాకుళంలో 8, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 8, పశ్చిమగోదావరిలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా మొత్తం కేసుల సంఖ్య 1,23,740 ఉండగా, రెండో స్థానంలో 93,871 కరోనా కేసులతో పశ్చిమగోదావరి జిల్లా ఉంది.

    కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ..

    కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే ఎక్కువ..

    గత 24 గంటల్లో 350 మంది కరోనా బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,72,266కు చేరింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3238 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,18,84,085 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.

    దేశంలోనూ కొత్త కేసుల క్షీణత..

    దేశంలోనూ కొత్త కేసుల క్షీణత..

    మరోవైపు దేశంలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 20,036 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,02,86,710కి చేరింది. కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య అధికంగా ఉండటం గమనార్హం. ఒక్క రోజు వ్యవధిలో 23,181 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 98,83,461గా ఉంది. రికవరీ రేటు 96.08 శాతంగా ఉంది. గత 24గంటల్లో 256 మంది కరోనాతో మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,48,994కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,54,254 యాక్టివ్ కేసులున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+