ఏపీలో మరో 34 కరోనా కేసులు- 473కు చేరిన బాధితులు.. 100 దాటేసిన గుంటూరు..
ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం మినహాయిస్తే రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్ లో గుంటూరు జిల్లా అత్యధికంగా 109 కేసులతో టాప్ లో నిలిచింది.
ఏపీలో కరోనా విజృంభణ...
ఏపీలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 500కు చేరుకుంటోంది. తాజాగా నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకూ పరీక్షించిన శాంపిల్స్ లో 34 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 473కు చేరుకుంది. గత 24 గంటల్లో 2010 శాంపిల్స్ పరీక్షించగా.. 41 కేసులు బయటపడినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

టాప్ లో గుంటూరు-109కి చేరిక..
ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారి కారణంగా గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద కర స్ధాయికి చేరుకుంది. ఇవాళ తాజాగా ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 473 కేసులు నమోదైతే ఒక్క గుంటూరులోనే 109 మంది ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. తాజాగా గుంటూరు లో 16, కృష్ణా లో 8, కర్నూల్ లో 7, అంతఃపురంలో 2, నెల్లూరులో ఒకటి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కారణంగా 7 గురు మృతి చెందినట్లు ప్రభుత్వె తెలిపింది. కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని 14 మంది డిశ్చార్జ్ అయ్యారు.












Click it and Unblock the Notifications