చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో 4గురు స్పెయిన్ దేశస్తుల మృతి: అక్కడ పలు ప్రమాదాలు

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు స్పానిష్ జాతీయులతో పాటు వారి వాహనం డ్రైవర్ మృతి చెందాడు. వారు మినీ బస్సులో ప్రయాణిస్తుండగా ట్రక్కు ఆ బస్సుపైకి దూసుకు వచ్చింది.

|
Google Oneindia TeluguNews

తిరుపతి: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు స్పానిష్ జాతీయులతో పాటు వారి వాహనం డ్రైవర్ మృతి చెందాడు. వారు మినీ బస్సులో ప్రయాణిస్తుండగా ట్రక్కు ఆ బస్సుపైకి దూసుకు వచ్చింది.

ఈ విషాద సంఘటన శనివారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె సమీపంలో జరిగింది.

మదనపల్లె- పుంగనూరు మార్గం ఈడిగపల్లె సమీపంలోని యాతాలవంక మలుపు వద్ద మదనపల్లె వైపు వెళుతున్న కంటైనర్‌ అనంతపురం నుంచి పుదుచ్చేరి వెళుతున్న టెంపోను ఢీకొనడంతో టెంపోలో ప్రయాణిస్తున్న స్పెయిన్‌ దేశానికి చెందిన 12 మందిలో డ్రైవర్‌తో సహా అయిదుగురు మృతి చెందారు.

4 Spanish nationals die in Andhra Pradesh road mishap

ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా, స్పెయిన్‌లోని ఎన్జీవో గ్రూప్ తరఫున రూరల్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు వారు వచ్చారు.

ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ... అతివేగం వద్దని డ్రైవర్లకు అవగాహన కల్పించినా ఫలితం ఉండటం లేదన్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో రోడ్డు అండ్ బిల్డింగ్ అధికారులను పోలీస్ టీం కలిసి రహదారిని పునరుద్ధరించాలని కోరిందని తెలిపారు. ఈ మేరకు అనుమతులు వచ్చాయని, పనులు ప్రారంభమయ్యాయన్నారు.

English summary
Four Spanish nationals and their driver were killed when a truck rammed into the minibus in which they were travelling. The accident occurred near Madan-apalle in Chittoor district of Andhra Pradesh on Saturday. The victims include two women. Nine other Spanish nationals were also injured in the accident and are admitted in a hospital at Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X