హైదరాబాద్, తిరుపతి ప్రయాణికులకు రైల్వే అలర్ట్..! ఈ ప్రత్యేక రైళ్లు రద్దు..
ఈ వేసవి రద్దీని తట్టుకునేందుకు హైదరాబాద్ లోని కాజీపేట, చర్లపల్లి స్టేషన్ల నుంచి తిరుపతికి దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను గతంలో ప్రకటించింది. అయితే నిర్వహణా కారణాలతో వీటిలో కొన్ని రైళ్లను ఇవాళ రద్దు చేసింది. వీటి వివరాలను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులతో పాటు జనరల్ బుకింగ్ చేసుకున్న వారు కూడా ఈ వివరాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.
ఇవాళ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం 07257 నంబర్ చర్లపల్లి నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలును ఈ నెల 8 నుంచి 29వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే నంబర్ 07258 తిరుపతి నుంచి చర్లపల్లికి వెళ్లే మరో ప్రత్యేక రైలు ఈ నెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ రద్దు చేశారు. అలాగే నంబర్ 07253 కాజీపేట నుంచి తిరుపతికి వెళ్లే ప్రత్యేక రైలును ఈ నెల 6వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రద్దు చేశారు. చివరిగా నంబర్ 07254 తిరుపతి-కాజీపేట ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ రద్దు చేశారు.

ఈ రైళ్లు మినహా ఇప్పటివరకూ ప్రకటించిన అన్ని ప్రత్యేక రైళ్లూ యథావిధిగా ప్రయాణాలు కొనసాగించనున్నాయి. అలాగే పైన చెప్పిన రైళ్లు కూడా మిగిలిన తేదీల్లో ప్రయాణాలు కొనసాగించబోతున్నాయి. కాబట్టి ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు టికెట్లు బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. కాబట్టి తిరుపతి, హైదరాబాద్ ప్రయాణికులు ఈ షెడ్యూల్స్ ను గమనించాల్సిందిగా అధికారులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications