తోటికోడళ్లు, అక్కాచెల్లెళ్లు : నదిలో పడి నలుగురు మహిళల దుర్మరణం

ఇచ్చాపురం : వారంతా బట్టలు ఉతికేందుకు నదిలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెంది .. కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చారు. మృతులు నలుగురు మహిళలు కావడం విశేషం. ఇద్దరు తోటి కోడళ్లు, వారి కుమార్తెలు విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబాలు గుండెలవిసేలా రోదిస్తున్నాయి. తమ ఇంటి ఆడపడుచులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి రోదనలు మిన్నంటాయి. ఇదివరకు కూడా నదిలోకి బట్టలు ఉతికేందుకు వెళ్లారని ... గతంలో ఇలాంటి ఘటన జరగలేదని చెప్తున్నారు.

విషాదం ..

ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలో జరిగింది. బిర్లంగి గ్రామానికి చెందిన సీతారాం ఆటో నడిపిస్తుంటాడు. సీతారాం అతడి సోదరుడు రాధాశ్యాం పక్క పక్కనే ఉంటారు. సీతారాం భార్య ఢిల్లమ్మ, కూతురు గాయత్రి, రాధాశ్యామ్ భార్య కమల, కూతురు అంజలి సోమవారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు బహుదా నదికి వెళ్లారు. రోజులానే వెళ్లిన ఈసారి వారిని మృత్యువు కబళించింది. నదిలో పడి చనిపోయారు.

4 women fell in to river .. and die

ప్రమాదవశాత్తు ...
బట్టలు ఉతుకుతుండగానే ప్రమాదవశాత్తు మునిగారు. ఒకరు పడి .. మరొకరిని కాపాడేక్రమంలో చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు తోడి కోడళ్లు కాగా .. వారి కూతుళ్లు కూడా విగతజీవులుగా మారడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం నిర్వహించి .. మృతుల బంధువులకు అప్పగిస్తారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ పోలీసులు పేర్కొన్నారు. ఇందులో ఏ కట్రకోణం ఉండదని పోలీసులు చెప్తున్నారు.

ఈసారే ఎందుకిలా ?
ఇదివరకు కూడా వారు బట్టలు ఉతికేందుకు వెళ్లేవారని చుట్టుపక్కల వారు చెప్తున్నారు. ఇవాళే ఇలా జరిగిందని తెలిసి ఆశ్చర్య పోతున్నామని పేర్కొన్నారు. గతంలో గ్రామస్థులకు ఇలాంటి ఘటన జరుగలేదని చెప్పారు. కానీ కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఊరిలో విషాదం నింపింది. కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+