స్కూల్లోంచి నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్.. రూ.ఐదు లక్షల డిమాండ్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వండర్ కిడ్స్ స్కూల్లో శ్యామ్(4) అనే బాలుడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ బాలుడి తల్లిదండ్రులకి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ.ఐదు లక్షలు
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వండర్ కిడ్స్ స్కూల్లో శ్యామ్(4) అనే బాలుడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కూలు వద్దకు వచ్చిన కొంత మంది దుండగులు శ్యామ్ తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగిందని, ఆ చిన్నారిని అర్జెంటుగా తీసుకెళ్లాలని నమ్మబలికారు.
ఆ చిన్నారికి సంబంధించిన పలు వివరాలను ఆ దుండగులు సరిగ్గానే చెప్పడంతో ఆ స్కూలు యాజమాన్యం వారి మాటలను నమ్మి శ్యామ్ ను వారికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం ఆ బాలుడి తల్లిదండ్రులకి ఫోన్ చేసిన కిడ్నాపర్లు రూ.ఐదు లక్షలు ఇస్తేనే వదిలేస్తామని బెదిరించారు.

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ గురించి గాలింపు చర్యలు ప్రారంభించారు. భీమవరం పరిసర ప్రాంతాల్లోనే కిడ్నాపర్లు ఉండి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications