ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు: పెరిగిన రికవరీ, 5వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా 400కు దిగువనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 37,744 నమూనాలను పరీక్షించగా.. 400 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, నలుగురు మృతి

ఏపీలో కొత్తగా 400 కరోనా కేసులు, నలుగురు మృతి

కొత్తగా నమోదైన 400 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,63,577కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.

చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,343కి పెరిగింది.

ఏపీలో 5102కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఏపీలో 5102కు తగ్గిన యాక్టివ్ కేసులు

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 516 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,44,132కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 5,102 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,64,255 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు

ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 08, చిత్తూరులో 73, తూర్పుగోదావరిలో 31, గుంటూరులో 50, కడపలో 25, కృష్ణాలో 68, కర్నూలులో 03, నెల్లూరులో 22, ప్రకాశంలో 09, శ్రీకాకుళంలో 29, విశాఖపట్నంలో 33, విజయనగరంలో 07, పశ్చిమగోదావరిలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,93,232, చిత్తూరులో 2,46,419 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,914) కరోనా కేసులున్నాయి.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 13.40,158 నమూనాలను పరీక్షించగా.. 15,906 మందికి కరోనా సోకినట్లు తేలింది. శనివారం 561 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించినవారి సంఖ్య 4,54,269కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 16,479 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.35 కోట్లు దాటింది. రికవరీ రేటు 98.17 శాతానికి పెరిగింది. రికవరీ పెరగడంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం దేశంలో 1,72,594 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 0.51 శాతానికి తగ్గింది. మరో వైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. దేశంలో శనివారం 77,40,676 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు కరోనా టీకా తీసుకున్నవారి సంఖ్య 1.02 కోట్లకు చేరింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+