బెజవాడ కల్తీ మద్యం: చంద్రబాబు పరామర్శ, మృతులు వీరే (ఫోటోలు)

అమరావతి: బెజవాడలోని కృష్ణలంక స్వర్ణబార్‌లో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నగరంలోని ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో ఆయన మాట్లాడారు.

అక్కడున్న 17 మందిలో నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉందన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఘటన విచారకరమని, తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.

ఈ రోజు తాగిన మందు ఎక్కువ రుచిగా ఉందని, అక్కడ ఏ బ్రాండ్ ఇస్తున్నారో కనిపించదని, అడిగితే దౌర్జన్యం చేస్తారని బాధితులు తనతో చెప్పారన్నారు. బార్‌లోని నీళ్లు వాడిన వాళ్లే కాకుండా, ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్లిన వాళ్లూ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇదే తరహా గతంలో జరిగిన సంఘటనలపై కూడా దర్యాప్తు జరుపుతాపని స్పష్టం చేశారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి మల్లాది బాలాత్రిపురసుందరమ్మ, కుటుంబీకులు భాగవతుల శరత్‌చంద్ర, కావూరి పూర్ణచంద్రశర్మ, కావూరి లక్ష్మీసరస్వతి పేర్లతో గత పదేళ్లుగా కృష్ణలంకలో నడుస్తున్న స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్‌లో సోమవారం ఉదయం ఈ దారుణం జరిగింది.

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

మృతులు, బాధితులంతా కాయకష్టం చేసుకుంటూ రోజువారీ కూలి డబ్బుతో జీవనం సాగించేవారే. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో బార్ నడుస్తున్నప్పటికీ ఏ అధికారీ ఇప్పటివరకు కనె్నత్తి చూడకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటలకు బార్ షట్టర్ తెరచిన కొన్ని నిమిషాల్లోనే మద్యం తాగినవారు కనీసం ఇళ్లకు కూడా చేరుకోకుండా అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారు కావటంతో కుటుంబీకులకు క్షణాల్లో సమాచారం అందటం, ఆటోలు, అంబులెన్స్‌ల్లో వారిని ప్రభుత్వాసుపత్రికి చేర్పించడం చకచకా జరిగిపోయింది. కొందరు తమ ఇళ్లకువెళ్లి వాంతులతో స్పృహతప్పి పడిపోగా, వారినీ ఆస్పత్రులకు తరలించారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

కలెక్టర్ బాబు.ఎ ఆదేశాలపై రెవెన్యూ అధికారులు గత రాత్రి ఆ బార్‌లో మద్యం తాగిన వారెవరు ఉన్నారో, వీధుల్లో ప్రచారం ద్వారా గుర్తించి అలాంటివారిని ముందస్తు జాగ్రత్తగా వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఒకరిద్దరు ఆ బార్‌కు సమీపంలోనే రోడ్డుపైపడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

ఉదయాన్నే తప్పతాగి పడివున్నారులే అని రోడ్డుపై పడినవారిని ముందుగా ఎవరూ గుర్తించలేదు. అయితే నురగలు కక్కుతుండటాన్ని చూసి ఆసుపత్రికి తరలించారు. మునగాని శంకర్రావు (65), నరసా గోపి (52), బాషా (40), మస్తాన్ వలీ (32), నాంచారయ్య (55) మరణించిన వారిలో ఉన్నారు. సురభి నాగబాబు, ఎం శంకర్, మిద్దెల సన్యాసిరావు, షేక్ సైదా, ఎం అక్కునాయుడు, నాసా వెంకట గోపీకృష్ణ, షేక్ భాయ్, గంగు శ్రీను, విజ్జి వెంకట్రావు, మీసాల సాహెబ్, నక్కా బూసిరెడ్డి, నక్కల సత్యం, దువ్వా గురుస్వామి, యాకూబ్ సహా మొత్తం 28మంది అస్వస్థతకు గురికాగా, వీరిలో ఏడుగురు వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ బాబు.ఎ, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, మున్సిపల్ కమిషనర్ జి వీరపాండ్యన్ తదితరులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఎక్సైజ్ మంత్రి రవీంద్ర ఆదేశాలపై అధికారులు వివిధ మద్యం బ్రాండ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం ప్రయోగశాలకు పంపారు. అనంతరం బార్ మేనేజర్ రమణారావుతోపాటు మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

పలువురి మరణానికి దారితీసిన పరిస్థితులపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు వేర్వేరుగా విచారణలు చేపట్టాయి. బాధితులు తాగిన మద్యంలో ప్రమాదకరమైన కలుషిత మిథనాల్ అధికంగా ఉన్నట్టు వైద్యులు నిర్థారిస్తున్నారు. మద్యంలోనే కల్తీ చేస్తున్నారని ఎక్సైజ్ అధికారులు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపిస్తుండగా, మద్యంలో కలిపి తాగిన నీరు కలుషితమైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు.

 బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

మద్యం మత్తును పెంచేందుకు కూలర్‌లోని నీటిలో మిథనాల్‌ను కలిపి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తెల్లవారుఝామున నీటిలో విషం కలిపి ఉండొచ్చని, దీనిపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేస్తున్నారు. హైవర్డ్ విస్కీ, డిఎస్‌పి, బ్లాక్‌పేపర్ వంటి పలురకాల బ్రాండ్ల మద్యాన్ని సోమవారం ఉదయం పలువురు తాగారు.

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

ఒరిజినల్ ఛాయిస్ తాగినవారంతా బాధితులు కావటంతో ముందుజాగ్రత్త చర్యగా రాష్టవ్య్రాప్తంగా ఒరిజినల్ ఛాయిస్-120 నెంబర్ బ్యాచ్ మద్యం అమ్మకాలను పూర్తిగా నిలిపివేశారు. పలువురు బాధితుల భార్యలు చివరి కార్తీక సోమవారం కావటంతో సమీప శివాలయాలకు వెళ్లివచ్చేసరికి దుర్ఘటన జరిగిపోయిందంటూ కన్నీరుమున్నీరయ్యారు.

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

బెజవాడ కల్తీ మద్యం: అడిగితే దౌర్జన్యం, చంద్రబాబు పరామర్శ

ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స కోసం ఆంధ్ర, కామినేని, సెంటినీ, రమేష్ కార్డియాక్ ఆసుపత్రులకు తరలించారు. వీరి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వం భరిస్తుందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తున్నామని, నివేదిక అందిన వెంటనే సంఘటనకు సంబంధించిన కారణాలను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+