ఏపీలో అక్కడ 5లక్షల ఉద్యోగాలు.. కేంద్రమంత్రి తీపికబురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన వరాలు అందుతున్నాయి. కేంద్ర మంత్రిగా ఏపీ నుండి రామ్మోహన్ నాయుడు ఉండడంతో ఆయన తన శాఖ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి చేయగలిగినంత చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస లో కొత్త కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ధ్రువీకరించారు.
పలాస కార్గో ఎయిర్ పోర్ట్ పై ప్రజాభిప్రాయ సేకరణ
పలాస కార్గో ఎయిర్పోర్ట్ పైన స్థానికులు అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. కార్గో విమానాశ్రయ నిర్మాణం పైన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ప్రాజెక్టు వస్తే దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు.

ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై రైతులతో మాట్లాడిన మంత్రులు
శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో కార్గో విమానాశ్రయ నిర్మాణం పైన జరిపిన అభిప్రాయ సేకరణలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తో పాటు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే శిరీష తో పాటు పలువురు అధికారులు నేతలు పాల్గొన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదని వారు రైతులకు తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
రైతుల అనుమానాలు, డిమాండ్లు
చెప్పిన విషయాలు విన్న రైతులు తమ అనుమానాలను వ్యక్తం చేశారు. మందస, వజ్రపుకొత్తూరు మండలాల రైతులు విమానాశ్రయ ఏర్పాటుకు మద్దతు ప్రకటిస్తూనే తమను ఎలా ఆదుకుంటారో స్పష్టమైన హామీ కావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక మెట్టూరు ,చీపురుపల్లి, బేతాళపురం, లక్ష్మీపురం, బిమిడి గ్రామ ప్రజలు తమ భూములకు మంచి ధరతో పాటు, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, భూమిని కోల్పోయిన వారికి అదనంగా సహాయం కూడా చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు క్లారిటీ ఇచ్చిన మంత్రి రామ్మోహన్ నాయుడు
ఏ గ్రామంలో ఎంత మేర భూమి అవసరం అవుతుందో చెప్పాలని కూడా వారు అడిగారు. రైతులతో మాట్లాడిన తర్వాత స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలాసలో ఉద్దానం ఎయిర్పోర్ట్ అవగాహన సభను గ్రామస్తులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో నిర్వహించామని, ప్రతిపాదిత విమానాశ్రయం పట్ల సానుకూలత రావడం సంతోషమని పేర్కొన్నారు.
ప్రతీ అంశాన్ని పరిష్కరిస్తామన్న మంత్రి
ప్రజలు తెలిపిన ప్రతి సూచనను, అభిప్రాయాలను జాగ్రత్తగా విన్నామని, పారదర్శకంగా ప్రతి అంశాన్ని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇది ఉద్దానం ప్రాంతానికి అభివృద్ధి, కనెక్టివిటీ అవకాశాలను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతులకు నష్ట పరిహారంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపైన రైతులకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
-
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!











Click it and Unblock the Notifications