బంగాళాఖాతంలో ఏడు రోజులు: 150 కిలోమీటర్లు ఈదిన కాకినాడ మహిళ
Bay of Bengal: కాకినాడ జిల్లాకు చెందిన ఓ మహిళ అతి పెద్ద సాహసం చేశారు. 52 సంవత్సరాల వయస్సులో బంగాళాఖాతాన్ని ఈదారు. 150 కిలోమీటర్ల దూరం పాటు ఆమె ఈదుకుంటూ వెళ్లారు. వారం రోజుల పాటు నిరాటంకంగా సముద్రంపైనే గడిపారు. కొత్త సంవత్సరం వేళా సముద్రంపైనే ఉన్నారు.
ఆమె పేరు గోలి శ్యామల. ఊరు- సామర్లకోట. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తోన్నారు. సముద్రాలను ఈదడం ఆమె హాబీ. గతంలో రామసేతు సమీపంలో అలవోకగా ఈ సాహసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆ తరువాత శ్రీలంక, లక్షద్వీప్‌ల వద్దా తన ప్రతిభను ప్రదర్శించారు.

ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె సముద్రంలోకి దిగారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకూ 150 కిలోమీటర్ల దూరం పాటు ఆమె బంగాళాఖాతంలో ఈదుకుంటూ వెళ్లారు. డిసెంబర్ 28వ తేదీన ఉదయం ఈ సాహసకృత్యానికి శ్రీకారం చుట్టారు. ఆర్కే పురం నుంచి కాకినాడ తీరం వైపు ఈత మొదలుపెట్టారు.
వారం రోజుల తరువాత అంటే ఈ శుక్రవారం నాడు కాకినాడకు చేరుకున్నారు. ఇక్కడి సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్‌కు చేరుకోవడంతో ఆమె అడ్వెంచర్ ముగిసింది. అంతకుముందు- తమిళనాడు- శ్రీలంక నార్త్ ప్రావిన్స్‌ను అనుసంధానించే పాల్క్ స్ట్రెయిట్‌ను 13 గంటల 43 నిమిషాల్లో అధిగమించారు. దీన్ని ఈదిన రెండో మహిళ శ్యామలే.
గతంలో అమెరికాలోని కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు ఈదారు. కాటలినా ఐలండ్ నుంచి లాస్ ఏంజిలిస్ వరకు గల 36 కిలోమీటర్ల దూరాన్ని 12 డిగ్రీల టెంపరేచర్‌లో 19 గంటల్లో అధిగమించారు. లక్షద్వీప్‌లో కీల్టన్ ఐలండ్- కడ్మట్ ఐలండ్, హుగ్లీ, గంగ, భాగీరథీ నదుల్లో రికార్డు సమయాల్లో ఈది రికార్డు సృష్టించారు.












Click it and Unblock the Notifications