ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, విజయనగరంలో సింగిల్ డిజిట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 64,354 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 538 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇద్దరు కరోనా బాధితులు మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

Recommended Video

    Andhra Prades Corona Cases జిల్లాలవారీగా కరోనా కేసులు... ఏపీలో పెరుగుదల, దేశంలో తగ్గుముఖం !
    ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు.. 558 మంది కోలుకున్నారు

    ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు.. 558 మంది కోలుకున్నారు

    తాజాగా, నమోదైన 538 కరోనా పాజిటివ్ కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. తాజా మరణాలతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7047కు చేరింది. గత 24 గంటల్లో 558 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,61,711కు చేరింది.

    ఏపీలో 5వేలకు చేరిన యాక్టివ్ కేసులు

    ఏపీలో 5వేలకు చేరిన యాక్టివ్ కేసులు

    గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరు, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 5237 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,35,197 కరోనా నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

    ఏపీలో జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు

    ఏపీలో జిల్లాలవారీగా కొత్త కరోనా కేసులు

    ఇక జిల్లాలవారీగా కరోనా కేసులను గమనించినట్లయితే. అనంతపురంలో 14, చిత్తూరులో 95, తూర్పుగోదావరిలో 50, గుంటూరులో 72, కడపలో 13, కృష్ణాలో 86, కర్నూలులో 18, నెల్లూరులో 24, ప్రకాశంలో 35, శ్రీకాకుళంలో 21, విశాఖపట్నంలో 31, విజయనగరంలో 7, పశ్చిమగోదావరి జిల్లాలో 72 కరోనా కేసులు నమోదయ్యాయి.

    దేశంలో 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

    దేశంలో 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు

    మరోవైపు దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. గత 11 రోజులుగా రోజూవారీ పాజిటివ్ కేసులు 40వేలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం 9,22,959 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 31,521 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,67,371కి చేరింది. గత 24 గంటల్లో 412 మరణాల సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 1,41,772కు చేరింది. ప్రస్తుతం దేశంలో 3,72,293 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 3.81 శాతానికి తగ్గింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+