వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ కౌంటింగ్‌పై ఈసీ నజర్ : 55 కేంద్రాల్లో కౌంటింగ్‌కు ఏర్పాట్లు

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 34 చోట్ల 55 కేంద్రాల్లో కౌంటింగ్ చేపడతారు. కౌంటింగ్ కోసం 13 జిల్లా కలెక్టర్లు నిమగ్నమయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం 25 వేల మంది సిబ్బంది, 200 మంది పరిశీలకుల సేవలను వినియోగిస్తున్నట్టు సీఈవో ద్వివేది తెలిపారు.

లాటరీ విధానంలో వీవీప్యాట్లు ..
ఉదయం 8.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభవుతుందని చెప్పారు. నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు అన్ని రౌండ్లు పూర్తయిన తరువాత ఐదు వీవీప్యాట్‌ యంత్రాలను లాటరీ విధానంలో తీస్తామన్నారు. వీవీ ప్యాట్‌ల్లోని స్లిప్పులను లెక్కించడం పూర్తయిన తర్వాతే నియోజకవర్గ ఫలితాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామని .. తదుపరి అధికారికంగా మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

55 places in ap assembley, loaksabha counting

రీ కౌంటింగ్ ఛాన్స్ ..
కౌంటింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై ఏపీ సీఈవో గోపాలకృష్ణ ద్వివేది వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లాల ఎన్నికల పరిశీలకులు, ఎస్పీలు, సీపీలు, ఆర్వోలు పాల్గొన్నారు.'కౌంటింగ్‌లో వీవీ ప్యాట్‌లో స్లిప్పులు, ఫారం-17సీ లెక్కలతో సరిపోవాలన్నారు ద్వివేది. కౌంటింగ్‌కు ముందు మాక్‌ పోల్‌ రిపోర్టు కూడా లెక్కలతో సరిపోవాలని ... వీవీ ప్యాట్‌ స్లిప్పులు ఈవీఎం ఓట్లతో మ్యాచ్ కావాలన్నారు. ఎన్నికల లెక్కింపులో సందేహాలు వస్తే పోలింగ్‌ డైరీ రిపోర్టుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాంకేతిక సమస్యలు, వివాదాలు తలెత్తిన చోట ఫలితాలపై ఈసీదే తుది నిర్ణయమని స్పష్టంచేశారు. మొరాయించిన ఈవీఎంల లెక్కింపు కౌంటింగ్‌ చివర్లో జరుపుతామని క్లారిటీ ఇచ్చారు. ఓట్ల లెక్కింపుపై పార్టీల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఆర్వోదే డిసిసన్ తీసుకుంటారని ... ఏదైనా కేంద్రంలో తక్కువ మార్జిన్‌ వస్తే రీకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని స్పష్టతనిచ్చారు.

English summary
The state election commission is making arrangements for counting votes for Assembly and Parliament elections in AP. Counting at 55 centers across 34 states of the state. 13 district collectors were involved in counting. Counting process starts on Thursday morning from 8 am. It has 25,000 personnel and 200 observers, CEO Dwivedi said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X