ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 67వేలకు యాక్టివ్ కేసులు, పెరిగిన రికవరీ, జిల్లాలవారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గత కొద్ది రోజులుగా 6వేలకు దిగవనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే, తాజాగా, 6వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,07,764 నమూనాలను పరీక్షించగా.. 6,341 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 6341 కరోనా కేసులు, 54 మరణాలు
తాజాగా నమోదైన 6341 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,39,243కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 57 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 12 మంది మరణించగా, గుంటూరులో ఎనిమిది మంది, తూర్పుగోదావరిలో ఆరుగురు, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, అనంతపురం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలు, విజయనగరంలో ఇద్దరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా మరణాల సంఖ్య 12,224కు చేరింది.

ఏపీలో పెరుగుతున్న రికవరీ.. 67వేలకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,486 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 17,59,390కి చేరింది. రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం 67,629 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,09,46,911 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1247 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అల్పంగా విజయనగరంలో 191 మంది కరోనా బారినపడ్డారు.
Recommended Video

ఏపీలో జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 316, చిత్తూరులో 919 , తూర్పుగోదావరిలో 1247, గుంటూరులో 353, కడపలో 378, కృష్ణాలో 461, కర్నూలులో 266, నెల్లూరులో 295, ప్రకాశంలో 453, శ్రీకాకుళంలో 372, విశాఖపట్నంలో 299, విజయనగరంలో 191, పశ్చిమగోదావరిలో 791 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,53,185, చిత్తూరులో 2,12,444 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు మించిపొయాయి. కాగా, జూన్ 21 నుంచి లాక్‌డౌన్ సడలింపుల సమయాన్ని పెంచుతున్నట్లు సర్కారు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునివ్వనున్నారు.












Click it and Unblock the Notifications