ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో తీపి కబురు..

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్‌ కింద ప్రతీ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటిస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అనౌన్స్ చేసింది. కాగా లేటెస్ట్ గా ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఐదు నగరాలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన ఈ అవార్డుల్లో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలు చోటు దక్కించుకున్నాయి.

విశాఖకు జాతీయ స్థాయి అవార్డు..

విశాఖపట్నం నగరంకు "స్పెషల్ కేటగిరీ మినిస్టీరియల్ అవార్డు" (Special Category Ministerial Award) దక్కింది. ఇది జాతీయ స్థాయిలో పొందిన అత్యున్నత గుర్తింపు. విశాఖలో పారిశుద్ధ్య పరంగా తీసుకున్న ఆధునిక చర్యలకు ఫలితమని అధికారులు పేర్కొన్నారు.

6-cities-from-andhra-pradesh-got-swachh-sarvekshan-awards

రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరం..

అలానే రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరానికి మినిస్టీరియల్ అవార్డు దక్కింది. నగరంలో వాడిన ప్లాస్టిక్ పరిమితి, మొబైల్ టాయిలెట్లు వంటివి ఇందుకు దోహదం చేశాయి.

స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్..

తిరుపతి, విజయవాడ, గుంటూరు నగరాలు స్వచ్ఛ సూపర్ లీగ్ సిటీస్ విభాగంలో అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ ఇది రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి మార్గదర్శకతకు ఇది నిదర్శనమని కొనియాడారు. ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, కార్మిక సిబ్బంది, ప్రజల సహకారానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు.

కాగా గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన స్థానాలు దక్కించుకున్నాయి. స్మార్ట్ పార్కింగ్, గ్రీన్ టెక్నాలజీ, డ్రైనేజ్ నిర్వహణ, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులు, పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల్లోనూ అధిక స్కోరు సాధించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+