క్షుద్రపూజలతో గదిలో నిర్బంధం, బాలికకు వాతలు

6-year-old girl rescued from tantrik
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో మూఢనమ్మకాల మాయలో పడి ఓ బాలికను దారుణంగా హింసించారు. అమావాస్యనాడు పుట్టింది, అరిష్టమంటూ ఆరేళ్ల బాలికను 20 రోజుల పాటు నిర్బంధించి క్షుద్రపూజల్లో ఆమెను హింసించారు. ఆ బాలిక పేరు రోషిణి.

అమావాస్య నాడు పుట్టిందని, ఇది అరిష్ట మని ఓ బంధువు ఆ బాలిక తల్లిదండ్రులను భయపెట్టాడు. దాంతో క్షుద్రపూజల పేరిట 20 రోజులపాటు బాలికను నిర్బంధించాడు. వంటిపై పలుచోట్ల వాతలు పెట్టాడు. తట్లు తేలేలా కొట్టాడు. మెడపై కోశాడు. పళ్ల గాట్లు పెట్టాడు. పాదాలను నలిపేశాడు. చిత్రహింసలు పెట్టి నరకం చూపించాడు.

అతనికి తల్లి దండ్రులు సహకరించారు. విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ, తాతయ్య బాలికను తీసువచ్చేడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సంఘటన తూర్పు గోదావరి జిల్లా కొండవరం గ్రామంలో జరిగింది.

ఇరుగుపొరుగువారు విషయాన్ని పిఠాపురం పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి బాలికను విడిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+