ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: తూ.గోలనే వంద దాటాయి!, 8వేల దిగువకు యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 600కి పైనే కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో 38,312 నమూనాలను పరీక్షించగా.. 624 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 624 కరోనా కేసులు, 04 మంది మృతి
తాజాగా నమోదైన 624 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,57,252కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడపలో ఒక్కొక్కొరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,254కి పెరిగింది.

ఏపీలో 8వేల దిగువకు యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 810 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,35,054కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 7,944 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,87,44,941 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 151 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో 8 కేసుల చొప్పున నమోదైంది.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 09, చిత్తూరులో 87, తూర్పుగోదావరిలో 151, గుంటూరులో 87, కడపలో 19, కృష్ణాలో 51, కర్నూలులో 13, నెల్లూరులో 66, ప్రకాశంలో 53, శ్రీకాకుళంలో 14, విశాఖపట్నంలో 08, విజయనగరంలో 08, పశ్చిమగోదావరిలో 36 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,92,496, చిత్తూరులో 2,45,131 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,840) కరోనా కేసులున్నాయి.
Recommended Video

దేశంలోనూ భారీగా తగ్గిన కొత్త కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కొత్తగా 18,166 కేసులు వెలుగులోకి వచ్చాయి. 214 రోజుల కనిష్ఠానికి ఇవి చేరాయి. శనివారం 214 మంది కరోనాతో మృతి చెందగా, ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,50,589కి చేరింది. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 23,624 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మహమ్మారిని జయించిన వారి సంఖ్య 3.32 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 97.99 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,30,971యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 0.68శాతంగా ఉంది. మరోవైపు, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందించిన టీకా డోసుల సంఖ్య 94.7కోట్లు దాటింది. త్వరలోనే వంద కోట్ల వ్యాక్నినేషన్ పూర్తి చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.












Click it and Unblock the Notifications