ఏపీలో తగ్గిన కరోనా: జిల్లాల వారీగా కొత్త కేసులు, టెస్టులు పెంచినా.., తగ్గిన యాక్టివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంతకుముందు రోజుకు 10వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు కాగా.. గత వారం రోజులుగా 10వేల కంటే తక్కువగా, ఇంకా చెప్పాలంటే 8వేలకు మించకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా తక్కువగానే ఉంటోంది.

ఏపీలో కొత్తగా 6923 కరోనా కేసులు, 45 మరణాలు
గత 24 గంటల వ్యవధిలో 76,416 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6923 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి చేరుకుంది. గత 24 గంటల్లో 45 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5708కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా మరణాలు
జిల్లాల వారీగా మరణాల సంఖ్యను గమనించినట్లయితే.. ప్రకాశంలో 8 మంది, కృష్ణాలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో మగ్గురు చొప్పున, చిత్తూరులో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు మృతి చెందారు.

ఏపీ జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు
జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 480, చిత్తూరులో 577, తూర్పుగోదావరిలో 1006, గుంటూరులో 535,
కడపలో 472, కృష్ణాలో 333, కర్నూలులో 229, నెల్లూరులో 506, ప్రకాశంలో 659,
శ్రీకాకుళంలో 503, విశాఖపట్నంలో 318, విజయనగరంలో 376, పశ్చిమ గోదావరిలో 929 కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా కరోనా పరీక్షలు.. తగ్గుతున్న యాక్టివ్ కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 56,00,202 కరోనా పరీక్షలను నిర్వహించారు. కాగా, తాజాగా, ఒక్క రోజు వ్యవధిలో 7796 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి రాష్ట్ర వ్యాప్తంగా 6,05,090 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 65వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. అత్యధిక కరోనా కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ.. మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఏపీలో కొత్త కరోనా పాజిటివ్ కేసుల కంటే.. కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం శుభపరిణామంగా చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications