ఏపీలో భారీగా కరోనా కేసులు.. 7వేల మందికి పాజిటివ్.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య రెట్టింపు అవుతోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు 7 వేల మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో చిక్సిత పొందుతున్నవారి సంఖ్య 36,108కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 14,514 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఏపీలో కొత్తగా 6,999 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ ఉప్పెనా విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 38,055 శాంపిల్స్ పరీక్షించగా 6,999 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 4,108 కేసులు వచ్చాయి. నిన్నటి వాటితో పోలిస్తే ఈరోజు 2,888 పాజిటివ్ కేసులు పెరిగాయి. ఒక్క రోజులోనే కేసులు రెట్టింపు స్థాయిలో పెరడం భయాందోళనకు గురిచేస్తోంది. విశాఖలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు కరోనా బారిన పడి మరణించారు. గడిచిన 24 గంటల్లో 1,066 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఏపీలో ఇప్పటి వరకు 21,14,489 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 20,63,867 మంది కోలుకున్నారు. మహమ్మారి బారిన పడి 14,514 మంది మృతి చెందారు.
చిత్తూరు, విశాఖ జిల్లాల్లో డెంజర్ బెల్
రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,534 మంది వైరస్ బారిన పడ్డారు. తర్వాత విశాఖ 1,263 , గుంటూరు 758, శ్రీకాకుళం 573, అనంతపురం 462, ప్రకాశం 424, విజయనగరం 412 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు కృష్ణా 326, తూర్పు గోదావరి 292, కర్నూలు 259, నెల్లూరు 246,పశ్చిమ గోదావరి 245, కడప 202 మంది కరోనా బారిన పడ్డారు. ఈ కేసులు సంఖ్య రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి సందర్భంగా జనాలు గుమి గూడటం, ఇతర రాష్ట్రాల నుంచి తరలి రావడం వంటి నేపథ్యంలో ఈ కేసులు పెరిగినట్లు భావిస్తున్నారు.

ఇవాల్టి నుంచి నైట్ కర్ఫ్యూ..
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్టవేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇవాళ నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఈ కర్ఫ్యూ ఈనెల 31 వరకు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. అయితే ఈ కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ, మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఐటీ, పెట్రోల్ బంకులు, విద్యుత్, పారిశుధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుంచి రాకపోకలు కొనసాగించే వారు సంబంధిత ఆధారాలు చూపించి గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర , రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించింది.












Click it and Unblock the Notifications