నిండు చూలాలి ఆత్మహత్యకు ప్రేరేపణ: టెక్కీ అరెస్టు

టెక్కీ అన్వేష్‌ను పోలీసులు ప్రిజనర్ ట్రాన్సీట్‌పై బెంగళూర్‌లో అరెస్టు చేసి హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. భార్యను తీవ్రంగా వేధించాడని, భార్యను ఆత్మహత్యకు పురికొల్పాడని అన్వేష్‌పై ఆరోపణలు వచ్చాయి.
31 ఏళ్ల శర్మిష్ట అప్‌ల్యాబ్స్‌లో పనిచేస్తూ ఉండేది. అటవీ మంత్రిత్వ శాఖలో ఫారెస్టు డైరెక్టర్ జనరల్‌గా పనిచేసిన మృతురాలి తండ్రి ప్రవత్ రంజన్ మొహంతీ, ఇతర కుటుంబ సభ్యుల ఒత్తిడితో పోలీసులు చివరకు అన్వేష్‌ను అరెస్టు చేశారు. శర్మిష్ట, అన్వేష్ కూడా ఒరిస్సాకు చెందినవారు.
శర్మిష్ట మరణం తర్వాత అన్వేష్ కనిపించకుండా పోయాడని, అతనిపై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ అయిందని సిఐడి వర్గాలు అంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అన్వేష్ బెంగళూర్‌లో ఆశ్రయం పొంది గత ఐదేళ్లుగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడని అంటున్నారు. ఆఫీసుకు వెళ్లి సిఐడి అధికారులు అన్వేష్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications