ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టిందా?: తాజా గణాంకాలు ఏం చేబుతున్నాయంటే..?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా పరీక్షలు పెరుగుతున్నప్పటికీ.. కొత్త కేసులు మాత్రం అంతగా పెరగడం లేదు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి కాస్త నియంత్రణలోకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వరుసగా ఈ తగ్గుదల నమోదైతేనే కరోనా వ్యాప్తి తగ్గుతుందని చెప్పే అవకాశాలుంటాయి.

ఆరున్నర లక్షల కేసుల దిశగా..

ఆరున్నర లక్షల కేసుల దిశగా..

తాజాగా, ఒక్కరోజులో 68,829 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 7553 మందికి కరోనా వచ్చినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,39,302కి చేరింది. 24 గంటల వ్యవధిలో 51 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 5461కి చేరింది.

జిల్లాల వారీగా కరోనా మరణాలు..

జిల్లాల వారీగా కరోనా మరణాలు..


ఇక జిల్లాల వారీగా కరోనా మరణాలు గమనించినట్లయితే.. చిత్తూరులో అత్యధికంగా 8 మంది, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, కడప, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించారు.

జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

జిల్లాల వారీగా కరోనా కొత్త కేసులు.. తూర్పుగోదావరిలో అత్యధికం

ఇక జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులను గమనించినట్లయితే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అనంతపురంలో 309,
చిత్తూరులో 902, తూర్పుగోదావరిలో 1166, గుంటూరులో 606, కడపలో 589,
కృష్ణాలో 344, కర్నూలులో 272, నెల్లూరులో 556, ప్రకాశంలో 672, శ్రీకాకుళ:లో 347,
విశాఖపట్నంలో 410, విజయనగరంలో 391, పశ్చిమగోదావరిలో 989 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 88,935, పశ్చిమగోదావరిలో 59,697 కేసులున్నాయి.

ఏపీ కోలుకుంటోందా?

ఏపీ కోలుకుంటోందా?

కాగా, గత కొద్ది రోజుల కొత్తగా నమోదవుతున్న కేసుల కంటే.. కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం గమనార్హం. తాజా గణాంకాలను బట్టి చూస్తే ఏపీలో కరోనా క్రమంగా తగ్గుతోందని తెలుస్తోంది. తాజాగా, 10,555 మంది పూర్తిగా కోలుకోగా... మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,51,821కు చేరింది. 71,465 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 52,29,529 నమూనాలను పరీక్షించారు. దేశ వ్యాప్తంగా అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+