తప్పిన ప్రమాదం: పాపికొండలకు వెళ్తున్న బోటులో మంటలు, బాబు ఆరా
Recommended Video

దేవీపట్నం: పశ్చిమగోదావరి జిల్లా దేవీపట్నం మండలం వీరవరపులంక వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. పాపికొండలను తిలకించేందుకు వెళ్తున్న ప్రయాణీకులను పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పాపికొండలను చూసేందుకు పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. అయితే స్థానికులు, పోలీసులు ప్రయాణీకులను సురక్షితంగా శుక్రవారం నాడు తీసుకొచ్చారు.
పాపికొండల యాత్రకు సుమారు 80 మంది పర్యాటకులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఈ పడవలో సుమారు 80 మంది పర్యాటకులు ఉన్నారు. ఈ పడవ దేవీపట్నం మండలం వీరవరపులంక వద్దకు చేరుకోగానే పడవలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. పోశమ్మ గుడి వద్ద నుండి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ పడవలో మంటలు వ్యాపించాయి.

దీంతో పడవలోని ప్రయాణీకులు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న వీరపులంక వాసులు నదిలో ఈదుకొంటూ వెళ్లి సుమారు 40 మంది పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ విషయమై సమాచారం అందుకొన్న పోలీసులు ఇతర అధికారులు కూడ హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకొని మిగిలిన వారిని కూడ రక్షించారు.
ఈ మంటల దాటికి పడవ పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్టుగా సమాచారం. అయితే ప్రయాణీకులను ఘటన స్థలం నుండి దేవీపట్నం తరలించారు.
పాత బోటు కావడం వల్ల ఇంజన్ వేడేక్కి మంటలు చేలరేగినట్టుగా పర్యాటకులు ఆరోపిస్తున్నారు. ఈ బోట్లను పర్యాటక శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. కానీ, అధికారుల నామమాత్రపు తనిఖీల కారణంగా ఈ పరిస్థితి వాటిల్లిందని పర్యాటకులు ఆరోపిస్తున్నారు.
80 మందితో పాపికొండలు వెళ్తున్న టూరిజం బోటులో అగ్ని ప్రమాదం సంభవించడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరా తీశారు.ఈ ఘటనపై చంద్రబాబునాయుడు అధికారులను ఆరా తీశారు.
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తో చంద్రబాబునాయుడు ఫోన్లో మాట్లాడారు. వేరే బోటును తెప్పించిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని బాబు ఆదేశించారు. ప్రయాణీలకు యోగ క్షేమాల గురించి తనకు సమాచారం ఇవ్వాలని బాబు ఆదేశించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications