ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధిక కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అయితే, ఒక్కోరోజు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా, 1000కి దిగువనే కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 42,679 నమూనాలను పరీక్షించగా.. 839 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం సాయంత్రం వెల్లడించింది.

ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు, 8 మంది మృతి
తాజాగా నమోదైన 839 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,39,529కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 8 మంది మృతి చెందారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 14,078కి పెరిగింది.

ఏపీలో 14,388 యాక్టివ్ కేసులు
ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 1142 మంది పూర్తిగా కోలుకోగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆ మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 20,11,063కి చేరింది. కాగా, రాష్ట్రంలో కొత్త నమోదైన కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం 14,388 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,77,63,761 కరోనా నమూనాలను పరీక్షించారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 231 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

ఏపీలో జిల్లాలవారీగా కరోనావైరస్ కొత్త కేసులు
ఏపీలో జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులు పరిశీలించినట్లయితే.. అనంతపురంలో 01, చిత్తూరులో 101, తూర్పుగోదావరిలో 231, గుంటూరులో 75, కడపలో 76, కృష్ణాలో 36, కర్నూలులో 04, నెల్లూరులో 149, ప్రకాశంలో 101, శ్రీకాకుళంలో 05, విశాఖపట్నంలో 47, విజయనగరంలో 00, పశ్చిమగోదావరిలో 13 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాలను గమనించినట్లయితే.. తూర్పుగోదావరిలో 2,89,434, చిత్తూరులో 2,42,187 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు లక్షకుపైగా ఉన్నాయి. ఒక్క విజయనగరం జిల్లాలోనే లక్షకు దిగువగా(82,678) కరోనా కేసులున్నాయి.

దేశంలోనూ భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలోనూ కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా, 30వేల కొత్త కేసులు వెలుగుచూశాయి. మరణాలు కూడా 300కు దిగువనే నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 11,77,607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 30,256 మందికి కరోనావైరస్ సోకినట్లు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.34 కోట్ల చేరింది. ఆదివారం 295 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో మరణించినవారి సంఖ్య 4.45 లక్షలకు చేరింది. ఆదివారం 43,938 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3.27కోట్లకు చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 97.72 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 3.18 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 0.95 శాతానికి తగ్గింది. ఆదివారంనాడు 37,78,296 మంది కరోనా టీకా వేయించుకున్నారు. దీంతో ఇప్పటి వరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 80,85,68,144కు చేరింది.












Click it and Unblock the Notifications