ఏపీలో కరోనా విజృంభణ: 24 గంటల్లో 845 పాజిటివ్ కేసులు, 14 వేల పరీక్షలు, ఐదుగురి మృతి..
ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 845 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఏపీలో పాజిటివ్ కేసులు వెయ్యి మార్క్‌నకు దగ్గరలో ఉంది. 845 పాజిటివ్ కేసుల్లో విదేశాలకు చెందిన నలుగురు, ఇతర రాష్ట్రాలకు చెందిన 29 మంది ఉన్నారు. 14 వేల 285 మంది నుంచి రక్తనమూనాలను సేకరించి, పరీక్షించామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ తెలిపింది.

మొత్తం 845 పాజిటివ్ కేసులు
845 పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 16 వేల 907గా ఉంది. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిని కూడా వైద్యారోగ్యశాఖ యాడ్ చేసింది. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్‌తో 5 మరణాలు సంబవించాయి. కృష్ణా, శ్రీకాకుళం, గుంటూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. వీరితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 198కి చేరింది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌కు చికిత్స తీసుకున్ని.. 7 వేల 313 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8586 మంది కరోనా వైరస్ కోసం చికిత్స తీసుకుంటున్నారు.

ఏపీలో 812
గత 24 గంటల్లో ఏపీలో 812 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 13 వేల 625కి చేరింది. 7559 మంది చికిత్స తీసుకుంటుండగా.. 5868 మంది డిశ్చార్జ్ అయ్యారు. చనిపోయిన 198 మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారే. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు చికిత్స తీసుకుంటున్నారే తప్ప చనిపోలేదు.
Recommended Video

ఇదీ లెక్క
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి, కరోనా సోకిన వారి సంఖ్య 2065గా ఉంది. అదే విదేశాల నుంచి వచ్చినవారు 407 మంది ఉన్నారు. 741 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు చికిత్స తీసుకుంటున్నారు. 286 మంది ఇతర దేశాల నుంచి వచ్చినవారు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1324 మంది డిశ్చార్జ్ కాగా, 121 మంది విదేశాల నుంచి వచ్చినవారు డిశ్చార్జ్ అయ్యారు.












Click it and Unblock the Notifications