Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ పై మంత్రి గొట్టిపాటి సమాధానం ఇదే..!!

అమ‌రావ‌తి: రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంద‌న్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా... అన్న‌దాత‌ల‌కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా వ్య‌వ‌సాయ ఉచిత‌ విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. శాస‌న‌స‌భ‌లో విద్యుత్ శాఖ‌కు సంబంధించి స‌భ్యులు బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ‌, ఉగ్ర న‌ర‌సింహారెడ్డి, బండారు సత్యానందరావులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గొట్టిపాటి సోమ‌వారం సభలో స‌మాధాన‌మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... కూట‌మి ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్ల‌కు, ఉచిత విద్యుత్ కు ఏడాదికి రూ.12,400 కోట్ల‌కు పైగా వ్య‌యం చేస్తుంద‌ని వివ‌రించారు.

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన అతి త‌క్కువ కాలంలోనే 22,709 వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు ఇచ్చామ‌ని తెలిపిన మంత్రి గొట్టిపాటి...మొత్తం 69,975 క‌నెక్ష‌న్ల‌ను మంజూరు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఒక్కో వ్య‌వ‌సాయ‌ విద్యుత్ క‌నెక్ష‌న్ కోసం కూటమి ప్రభుత్వం రూ.2.60 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి ఈ సంద‌ర్భంగా వివరించారు.డిస్కంల్లో విద్యుత్ ఉపకరణాల ధరలు తేడా ఉండడంపై గౌరవ సభ్యులు మాట్లాడిన విషయంపై మంత్రి గొట్టిపాటి స్పందించారు. వైసీపీ ప్ర‌భుత్వం విద్యుత్ రంగాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. స్థంబాలు, ట్రాన్స్ మిష‌న్ లైన్లను అత్య‌ధిక ధ‌ర‌ల‌కు కొనుగోలు చేయ‌డంతో మూడు డిస్కంల ప‌రిధిలోని ధ‌ర‌ల్లో వ్య‌త్యాసం ఏర్ప‌డింద‌ని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉపకరణాల కొనుగోలు ధరల్లో మార్పులు లేకుండా స్థిరీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Gottipati

ప‌గ‌టి పూటే రైతులకు 9 గంట‌ల నిరంతర ఉచిత విద్యుత్
పీఎం కుసుమ్ ప‌థ‌కాన్ని వైసీపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేయ‌డంతో...రైతుల‌కు ప‌గ‌టి పూట పూర్తి స్థాయి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో కొన్ని ఆటంకాలు ఏర్పడిన విషయాన్ని మంత్రి గొట్టిపాటి సభలో ప్రస్తావించారు. కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో... ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాల ప్ర‌కారం పీఎం కుసుమ్ ప‌థ‌కం ద్వారా అతి త్వ‌ర‌లోనే రైతుల‌కు 9 గంట‌ల నాణ్య‌మైన ఉచిత విద్యుత్ ను నిరంతరాయంగా అందించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్ల‌డించారు. రాష్ట్రంలో సుమారు 4.50 ల‌క్ష‌ల వ్య‌వ‌సాయ విద్యుత్ క‌నెక్ష‌న్లు అవ‌స‌రం అని అంచ‌నా వేసిన మంత్రి... ఇప్ప‌టికే ల‌క్ష పీఎం కుసుమ్ క‌నెక్ష‌న్ల‌కు మంజూర‌య్యాయ‌ని తెలిపారు. మ‌రో రెండు ల‌క్ష‌ల క‌నెక్ష‌న్లకు సంబంధించి కేంద్రం సానుకూలంగా స్పందించింద‌న్నారు. వీటికి సంబంధించి త్వ‌ర‌లోనే టెండ‌ర్ల ప్ర‌క్రియ మొద‌లు పెడుతున్నామ‌ని ఆయ‌న‌ తెలిపారు.

అల్యూమినియం ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌తో చోరీలకు అడ్డుక‌ట్ట‌...
రైతులు ఎదుర్కొంటున్న అన్ని స‌మ‌స్య‌ల‌నూ పూర్తి స్థాయిలో ప‌రిష్క‌రించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తుంద‌ని మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ పేర్కొన్నారు. లో ఓల్టేజ్ తో పాటు అధిక లోడ్ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు మూడు డిస్కంల ప‌రిధిలో త్వ‌ర‌లోనే 70 స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. అదే విధంగా ప‌ల్నాడు, ప్ర‌కాశం, బాప‌ట్ల ప్రాంతాల్లో జ‌రుగుతున్న ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌త‌నాలను నిలువ‌రించ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. ట్రాన్స్ ఫార్మ‌ర్ల‌లో ఉండే రాగి వైరు కోసమే దొంగ‌త‌నాలు జ‌రుగుతున్నాయ‌న్నారు.

ఇక‌పై అల్యూమినియం ట్రాన్స్ ఫార్మ‌ర్లను వినియోగించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వివ‌రించారు. అదే విధంగా ట్రాన్స్ ఫార్మ‌ర్ల దొంగ‌త‌నాల విష‌యంలో వెంట‌నే కేసులు న‌మోదు అయ్యేలా చూడాల‌ని పోలీస్ సిబ్బందికి సూచించామ‌ని మంత్రి గొట్టిపాటి సభకు వివరించారు. రాబోయే వ్య‌వ‌సాయ సీజ‌న్ స‌మ‌యానికి రైతుల‌కు విద్యుత్ శాఖ ప‌రంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప‌గ‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు మంత్రి గొట్టిపాటి వివ‌రించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+